42.2 C
Hyderabad
May 3, 2024 16: 43 PM
Slider గుంటూరు

దళితులపై జరిగే దాడులపై ఎస్సీ కమీషన్ తక్షణమే చర్యలు చేపట్టాలి

#godarameshkumar

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులపై దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,హత్యలపై రాష్ట్ర ఎస్సీకమీషన్ స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను ఈరోజు విజయవాడలో గల రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ది కొరకు కొనసాగుతున్న 17 రకాల పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయా పథకాలను కొనసాగే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు నష్టపరిహారం అదేవిధంగా కేసులలో నిందితులకు వెంటనే శిక్షలు పడే విధంగా పోలీస్ అధికారులు విచారణను వేగవంతంచేసే విధంగా ఆదేశించాలని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విద్యార్థిని రమ్య హత్య కేసును ఎస్సీ కమీషన్ సుమోటోగా స్వీకరించి త్వరగా నిందితునికి శిక్షపడేలా చర్యలు చెపట్టాలని పెండింగ్ లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరామని రమేష్ కుమార్  తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీహెచ్ పీయస్ నాయకులు శ్రీనివాసరావు,నాగేశ్వరరావు, అంజయ్య,వి జయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

Bhavani

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

Satyam NEWS

పల్లె నర్సింగరావును సన్మానించిన పిట్టల నరేష్‌ముదిరాజ్‌

Satyam NEWS

Leave a Comment