29.7 C
Hyderabad
May 14, 2024 01: 06 AM
Slider విజయనగరం

మీ సెల్ ఫోన్ పోయిందా…అయితే ఇలా చేయడంటూ ఎస్పీ అభయం

#deepikaips

ఈ మధ్య తరచూ కొంతమంది మొబైల్ ఫోన్ లు మాయం అవుతున్నాయి..మరికొంత మంది ఫోన్ గల్లంతు అవుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ దీపికా.. పోయిన సెల్ ఫోన్ లను ట్రేస్ అవుట్ చేసేందుకు ఫిర్యాదు చేసేందుకు కొత్తగా ఓ ఫోన్ నెంబర్ అదీ వాట్సాప్ నెంబర్ ను అందుబాటులో కి తీసుకువచ్చారు.

పోయిన మొబైల్స్ గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులో కి తీసుకువచ్చారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబరు 8977945606 ఏర్పాటు చేసింది.. జిల్లా పోలీసు శాఖ. పోయిన ఫోనులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించి, ట్రాకింగు చేసేందుకు చర్యలు చేపడుతోంది.

ఈ సందర్భంగా జిల్లా పరిధిలో ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వాట్సాప్ నంబరు 8977945606 కు ఫిర్యాదు చేస్తే, వాటిని ట్రాకింగు చేసి, బాధితులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు ఇటీవల కాలంలో పెరగడంతో, బాధితులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా, ఫిర్యాదుల స్వీకరణను సులభతరం చేస్తూ, చర్యలను చేపట్టామన్నారు.

ఇందుకు మొబైల్ పోగొట్టుకున్న వారు (1) ఫిర్యాదుదారుని పేరు (2) చిరునామా (3) సంప్రదించాల్సిన మొబైల్ నంబరు (4) మొబైల్ మోడల్ (5) ఐ.ఎం.ఈ.ఐ. నంబరు (6) ఫోను పోయిన తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలను పోలీసు వాట్సాప్ నంబరు 8977945606 కు పంపితే, పోయిన ఫోనులను ట్రాక్ చేసేందుకు, సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి చర్యలు చేపడతామన్నారు.

ఈ ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సైబరు సెల్ ను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోయిన ఫోనులను ట్రాకింగు చేసిన తరువాత వాటిని తిరిగి బాధితులకు అందజేస్తామన్నారు. ఒకవేళ పోయిన ఫోనులు ట్రాకింగు కాకుంటే చట్టపరమైన చర్యలు చేపట్టి, దర్యాప్తు చేయనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. మొబైల్ ఫోనులను పోగొట్టుకున్న వారు ఇకపై పోలీసు స్టేషనుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, పైన పేర్కొన వివరాలను పోలీసు వాట్సాప్ నంబరు 8977945606 కు వాట్సాప్ చేయాల్సిందిగా కోరారు.

వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైబరు సెల్ సిబ్బంది స్వీకరించి, వాటిని రిజిష్టరులో నమోదు చేసి, పోయిన మొబైల్స్ ను కనుగొనేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు.  జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులెవ్వరూ ఆందోళన చెందకుండా, పైన పేర్కొన్న వివరాలను వాట్సాప్ నంబరు 8977945606 కు పంపి, జిల్లా పోలీసుశాఖ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్పీ ఎం.దీపిక కోరారు.

Related posts

బ్యాంక్ ఖాతాలు స్తంభించిన రైతులకు కూడా మాఫీ

Bhavani

వనపర్తిలో ఏసీబీకి పట్టుబడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

Satyam NEWS

పేదలకు ఆహారం అందించిన మాధవరం రంగారావు యువసేన

Satyam NEWS

Leave a Comment