33.2 C
Hyderabad
May 14, 2024 12: 45 PM
Slider ప్రత్యేకం

నేరాలపై కత్తిదూస్తున్న విజయనగరం పోలీసులు

#vijayanagarampolice

విజయనగరం జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలపై ఎస్పీ దీపిక  ఆదేశాలతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జూదం, కోడి, గొర్రె పందాలు నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత ఖైనీ, గుట్కాలు, గంజాయి, ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు, కరోనా నిబంధనలు అతిక్రమించిన వారిపైన పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు, ఎస్ ఈ బి పోలీసులు సంయుక్తంగా 7 కేసులు నమోదు చేసి, 4 గురిని అరెస్టు చేసి, 195 లీటర్ల నాటు సారాను, 1.8 లీటర్ల ఐ.ఎం.ఎఫ్.ఎల్. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా నాటుసారా తయారీకి సిద్దం చేసిన 1000 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే జిల్లాలో 1999 దేవాలయాలు, 61 మసీదులు, 641 చర్చిలు, ఇతర  ప్రార్థన మందిరాలు ఉన్నట్లుగా గుర్తించి, మత సామరస్యానికి 284 శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు. అన్ని మతాల ప్రార్థన మందిరాల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ, ఏర్పాటు చేసిన 1,348 సిసి కెమెరాల పనితీరు పరిశీలించి, 2,155 ప్రార్థన మందిరాల భద్రతను బీట్లు, గస్తీని నిర్వహించి, పర్యవేక్షించారు.

ఇక కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో వాహనాలపై తిరుగుతున్న వాహనదారులపై 699 ఈ – చలానాలను విధించి, వారిపై 80,495/- లను జరిమానగా విధించారు. హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించని వాహనదారులు, అతి వేగంగా వాహనాలను నడిపిన వారిపైన, ఎంవి నిబంధనలను అతిక్రమించిన వారిపైన 998 కేసులను నమోదు చేసి 1 ల‌క్షా88,335/- లను ఈ చలానగా విధించారు.

దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టి, 256 మంది  దిశా  యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ల లో ఉంచుకునే  విధంగా చర్యలు చేపట్టారు. దీంతో  దిశా యాప్ ను ఇంత వరకు 4,13,496  మంది డౌన్ లోడ్  చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న 485 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, వాటిపై నిఘా ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు.

జిల్లాలోని ఎస్.కోట పీఎస్ పరిధిలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో మూడు కేసులు నమోదు చేసి, 9 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచీ 16 ల‌క్ష‌ల ,80,వేల విలువైన, 420 కిలోల గంజాయిని, 1,500/- ల నగదు, రెండు కీ ప్యాడ్ మొబైల్స్, 51 దుప్పట్లు, 51 చాపలు ను స్వాధీనం చేసుకున్నారు. వీరు దుప్పట్లు, చాపలు మధ్య గంజాయిని పెట్టీ తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో కేసులు నమోదు చేశారు.అలాగే తెర్లాం పీఎస్ పరిధిలో అక్రమంగా నిషేధిత గుట్కాలు కలిగిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి  22 వేలు విలువైన నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు…పోలీసులు.

Related posts

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు

Satyam NEWS

ఉభయసభలు మళ్ళీ వాయిదా

Bhavani

ఓ దిశ నువ్వెక్కడ: జీవోలు ఇవ్వడమే తప్ప ఆచరించడం శూన్యం

Satyam NEWS

Leave a Comment