39.2 C
Hyderabad
May 3, 2024 13: 25 PM
Slider ప్రత్యేకం

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు

జోగులాంబ గద్వాల్ జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , క్రయ ,విక్రయాల పై, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలిపారు.

రాష్ట్రం లో నకిలీ విత్తనాలను సమూలంగా నిర్ములించేందుకు ఎస్పీ పోలీస్ అధికారులతో టేలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లా లో నకిలీ విత్తనాల సరఫరా, క్రయ, విక్రయాల పై తీసుకోవలసిన చర్యల గురించి పలు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారి పై, మాయమాటలు చెప్పి రైతులను మోసాగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని జారీ చేసిన ఉత్తర్వులలో భాగంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఆయన అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మే వారి పై నిఘా ఉంచడానికి జిల్లా స్థాయిలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మరియు మండల స్థాయిలో ఎస్సై ల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీం లను, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మరో టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ టీం లు రోజు వారికి సీడ్స్ షాప్స్, మిల్లులు, పర్టీలైజర్ షాప్స్ లలో తనిఖీలు చేపడుతామని, టీం లు అన్ని కూడా జిల్లా ఎస్పీ, డి. ఎస్పీ పర్యవేక్షణలో పని చేస్తాయని తెలిపారు.

ఎవరైనా నకిలీ విత్తనాలను వాహనాలలో ట్రాన్స్ పోర్ట్ చేసినట్లు అయితే అట్టి వాహనం ను సీజ్ చేయడం తో పాటు యజమాని పై పిడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లా లో సరి హద్దుల్లో 7 చోట్ల ర్యాలం పాడు, పుల్లూరు, రాజోలి, జూరాల డ్యామ్, ఇర్కి చెడు, నందిన్నె, బలి గెరా లో వాహన తనిఖీ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు ఎస్సై లను ఇంచార్జి లుగా నియమించడం జరిగిందని అన్నారు. ఎట్టి పరిస్థితులలో నకిలీ విత్తనాలు జిల్లాలోకి రావడం గాని, జిల్లా నుండి బయటకు వెళ్లడం గాని జరగకూడదని సి. ఐ లకు, ఎస్సై లకు ఆదేశాలు జారీ చేశారు.

వ్యాపారులు స్టాకు లైసెన్సు బిల్ బుక్కులు తదితర వివరాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాపారులు రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో అన్ని వివరాలతో కూడిన రసీదులు తప్పకుండా ఇవ్వాలని అత్యాశకు పోయి నకిలీ విత్తనాలు విక్రయించి జైలుపాలు కాకూడదని ఎస్పీ తెలిపారు.

వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో నిరంతరంగా ఆకస్మిక తనిఖీలు చేపడతామని నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు అలాగే రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.

తక్కువ ధరకు వస్తున్నాయని అత్యాసకు పోయి నకిలీ విత్తనాలు కొనవద్దు, లైసెన్సు కలిగిన వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తప్పకుండా తీసుకోవాలని ఆ తర్వాత రశీదుల ను పంట అమ్ముకునే వరకు భద్రపరుచుకోవాలి అని అన్నారు.

గత సంవత్సరం లో కూడా నకిలీ విత్తనాల పై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేశామన్నారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మే వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.

రైతులకు పలు సూచనలు

ఎలాంటి గుర్తింపు లేని ఆర్గనైజర్ నుండి ఏలాంటి కంపెనీ సర్టిఫైడ్ లేని విత్తనాలను రైతులు కొని ఆరు నెలల పాటు కష్టపడి పంటను పండించి నష్టాల పాలై తమ కుటుంబాలను ఆర్థికంగా వెనుకబాటు చేసుకోవద్దు.

రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని కంపెనీ సర్టిఫైడ్ పొందిన విత్తనాలను సర్టిఫైడ్ పొందిన ఆర్గనైజర్ దగ్గర మాత్రమే కొని సాగు చేసుకోగలరు.

సీడ్ పత్తి సాగు చేయాలనుకునే రైతులు కంపెనీ సర్టిఫైడ్ పొందిన సీడ్ ఆర్గనైజర్ వద్దనే సీడ్స్ తీసుకోవాలి, సీడ్స్ ను రైతులు తీసుకున్నప్పుడు ఆర్గనైజర్ నుండి వారి సంతకం తో కూడిన రశీదు పొందాలి, అలాగే సీడ్స్ తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ దగ్గరే ఉంచుకున్నట్లైతే ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే ఆ ఆర్గనైజర్ ను, కంపెనీ ని, బాద్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయి

ఆర్గనైజర్, కంపెనీ పై కఠిన చర్యలు తీసుకొనుటకు జిల్లా ప్రభుత్వ అధికారులకు అవకాశం కల్పించబడుతుంది.

జిల్లా లో ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ సీడ్స్ ను అమ్ముతున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిన రైతులు సంబంధిత పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకరావాలి, లేదా డయల్ -100 /పోలీస్ కంట్రోల్ రూమ్ నెం -9494921100 కు సమాచారం అందించిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును.

ఎవరైనా నకిలీ సీడ్స్ ను అమ్మిన, సరఫరా చేసిన, అలాంటి వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అలాంటి వారి పై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయబడును.

గతం లో నమోదు అయిన కేసుల ఆధారంగా అవసరమైతే పి. డి యాక్ట్ కేసులు కూడా నమోదు చేయడానికి వెనుకాడబోము అని, గతం లో కేసులు అయిన వారి పైన, కొత్త వారి పైన నిఘా ఉంచడం జరుగుతుందని నకిలీ విత్తనాలు అమ్మేవారికి, వాటిని సరఫరా చేసే వారిని ఎస్పీ హెచ్చరించారు.

Related posts

One Side Love: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

Satyam NEWS

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

పాలేరులో పోటీచేస్తా… అవకాశమివ్వండి

Bhavani

Leave a Comment