42.2 C
Hyderabad
April 30, 2024 16: 55 PM
Slider ముఖ్యంశాలు

ఉభయసభలు మళ్ళీ వాయిదా

#Parliament

మణిపూర్ ఘటనలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్‌లో వాయిదా పర్వం కొనసాగింది. విపక్షాల నిరసనలతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు లోక్ సభలోలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

మిగిలిన సభా కార్యకలాపాలు వాయిదా వేసి మణిపూర్ అంశంపై చర్చించాలని కోరారు. నామా నాగేశ్వర్ రావు వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వడం వరుసగా ఇది నాలుగో రోజు. రాజ్యసభలోనూ ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీలు మణిపూర్ ఘటనలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.

మరోవైపు లోక్ సభలో విపక్షాల ఆందోళనలపై స్పీకర్ ఓం బిర్లా దృష్టి సారించారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని కోరుతూ ఇవాళ లోకసభలో అన్ని పక్షాల నేతలతో భేటీ అయ్యారు.

Related posts

జిన్నారం ఇంట్లో భారీగా మ‌ద్యం సీసాలు!!!

Sub Editor

ఇన్ జస్టిస్: అన్నా క్యాంటిన్లు మూసివేయడం అన్యాయం

Satyam NEWS

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment