38.2 C
Hyderabad
May 3, 2024 19: 14 PM
Slider ముఖ్యంశాలు

Vijayanagaram police: నో యాక్సిడెంట్ డే గా సిబ్బందితో ప్ర‌త్యేక చ‌ర్య‌లు

#vijayanagarampolice

ర‌హ‌దారి ప్ర‌మాదాల‌కు నివార‌ణ చ‌ర్య‌లు.!

నో యాక్సిడెంట్ డే గా ప్ర‌తీ శ‌నివారం…!.

15 రోజుల్లో  776  కేసులు న‌మోదు…!

పోలీస్ బాస్ ఆదేశాల‌తో సిబ్బంది చ‌ర్య‌లు…!

చదివారుగా…ఇదీ  ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ  దీపిక  తీసుకుంటున్న చ‌ర్య‌లు. ప్ర‌తీ శ‌నివారం  నో యాక్సిడెంట్ డే ప‌రిగ‌ణించి త‌ద‌నుగుణంగా సిబ్బంది ఆదేశాలు ఇచ్చి మ‌రీ..రోడ్ ప్ర‌మాదాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేప‌డుతున్నారు… జిల్లా ఎస్పీ

ఎం. దీపిక.. రహదారి ప్రమాదాలు నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన ప్రాంతాల్లో మరియు ముఖ్య కూడళ్ళలోను నిరంతరం పోలీసుసిబ్బంది వాహన తనిఖీలు చేపడుతున్నారు.అంతేకాకుండా, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నామ‌ని ఎస్పీ ఈ సంద‌ర్బంగా తెలిపారు.

ఇక ఈ ఏప్రిల్ మాసంలో గడ‌చిన 15 రోజులుగా మద్యం సేవించి వాహనాలునడిపిన వారిపై 301 కేసులు, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై 475 కేసులు నమోదు చేశామన్నారు. ఇక వారంలో ప్రతీ శనివారంను “నో ఏక్సిడెంట్ డే” గా పాటించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పోలీసు సిబ్బందిని ఇప్పటికే ఆదేశించామన్నారు.

ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరంతరం ప్రత్యేక వాహన తనిఖీలు చేపడతున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నందున, ప్రమాదాల నియంత్రణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతన్న వారిపై చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అన్నారు.

వాహనదారులు తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు స్వస్తి పలకాలన్నారు. అలా కాకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు.

Related posts

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు వేములవాడ దేవస్థానం ఆహ్వానం

Satyam NEWS

పండిత ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలి

Bhavani

Leave a Comment