27.7 C
Hyderabad
May 7, 2024 10: 27 AM
Slider విజయనగరం

ప్రశాంతంగా పోలింగ్ ముగియడానికి ఎస్పీ వ్యూహం…!

#RajakumariIPS

విజయనగరం జిల్లా కు దాదాపు రెండేళ్ల క్రితం వచ్చిన ఎస్పీ రాజకుమారీ హాయాంలో వచ్చిన పంచాయతీ ఎన్నికలను పటిష్టమైన వ్యూహ రచనలు చేసి ప్రశాంతంగా ముగించడంలో విజయం సాధించారు.

ఎప్పటికప్పుడు మేన్ ప్యాక్ లో సిబ్బందికి ఆదేశాలివ్వడం… బందోబస్తు కు సంబంధించి ప్రత్యేకించి వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అత్యంత పకడ్బందీగా వ్యూహాలు రచించడమే కాక అమలు జరిపి ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసేలా చర్యలు చేపట్టారు.

మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, ఏఓబీ సరిహద్దు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి మావోయిస్టుల ప్రభావం లేకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్వతీపురం ఒఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పహారా కాసారు.

జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఉదయం నుండే పలు పోలింగు కేంద్రాలను స్వయంగా సందర్శించి, పోలింగు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేసారు. పోలింగు కేంద్రాలకు 100మీటర్లు వరకు ఓటర్లు మినహా ఎవ్వరూ లేకుండా చర్యలు చేపట్టాలని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే సంబందిత రూట్ అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులకు సమాచారాన్ని అందించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

రామభద్రపురం, జీగిరాం, పి. కోనవలస, కూర్మరాజు పేట, మామిడిపల్లి, వివాదస్పద కొటియా గ్రామాలైన పట్టు చెన్నూరు, నందా, కొటియా, మోదంగి, మక్కువ, శంబర, కన్నం దొరవలస, చినభోగిలి, అజ్జాడ, సీతానగరం, చినమేరంగి, కురుపాం, తోటపల్లి, అజ్జాడ, కృష్ణపల్లి పోలింగు కేంద్రాలను స్వయంగా సందర్శించారు. ఓటింగుకు వచ్చిన వారిని భద్రతా సిబ్బంది వరుస క్రమంలో పంపడం, ఇతరులను పోలింగు కేంద్రాల్లోకి అనుమతించక పోవడం సత్ఫలితాలిచ్చాయి.

ఓటు హక్కు వినియోగించు కొనేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో నడవలేని వారిని పోలీసులు స్వయంగా కుర్చీల్లోను, చేతులతో ఎత్తుకొని పోలింగు కేంద్రాల వద్దకు చేర్చి, ప్రజాస్వామ్యబద్ధంగా వారు తమ ఓటును వినియోగించుకొనే విధంగా చర్యలు చేపట్టారు.

ఏజన్సీ ప్రాంతంలో మద్యాహ్నం 1-30గంటలకు, మైదాన ప్రాంతాల్లో 3-30గంటలకు పోలింగ్ ముగిసింది. అనంతరం, ఓట్ల లెక్కింపులకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయగా, భద్రతా ఏర్పాట్లును పోలీసుశాఖ చేపట్టింది. కౌంటింగు కేంద్రాల్లోకి అనుమతి ఉన్న వ్యక్తులను మినహా ఇతరులెవ్వరిని అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

పోలింగు అనంతరం అతి సమస్యాత్మక గ్రామాలను ఎస్పీ  సందర్శించి, కౌంటింగు కేంద్రాల వద్ద భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. హ ఎస్పీ వెంట పార్వతీపురం ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎన్.శ్రీనివాసరావు మరియు ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు.

Related posts

కరోనా హెల్ప్: విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

Satyam NEWS

మహిళల భద్రతకు 20 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్

Satyam NEWS

గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment