26.7 C
Hyderabad
May 3, 2024 08: 05 AM
Slider విజయనగరం

గదుల్లో పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లు..రోడ్ల మీద‌కు….!

#teachers

గురువుల(టీచ‌ర్లు) చేతుల్లో చీపురులు…! విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇదీ ప‌రిస్థితి…!  చేతిలో బెత్తం అదేనండీ కర్ర‌,లేదా సుద్ద‌ముక్క అదే లేదంటే  డ‌స్ట‌ర్, ఇక అది కూడా కాదంటే పుస్తకం ప‌ట్టుకోవ‌ల‌సిన టీచ‌ర్లు వీరంతా. ఇటీవ‌లే ప్ర‌భుత్వం యాప్ ల  ద్వారా పాఠ‌శాల‌లో మ‌ద్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి సంబంధించి ఎక్క‌డిక్క‌డ టీచ‌ర్లు స్థానిక ప‌రిస్థితిని పోటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేసి పెట్టాల‌ని డీఈఓ నుంచీ ఆదేశాలు రావ‌డంతో..అటు పాఠాలే చెప్పాలా…?  లేక పోటోలు తీయలా అంటూ…ఉపాధ్యాయ‌లంతా ఇలా జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట రోడ్ల‌ను చీపుర్ల‌తో ఊడుస్తూ…నిర‌స‌న తెలియ చేసారు.

యునైటెడ్  టీచ‌ర్స్ ఫ్రంట్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర నేత రాము నేతృత్వంలో ఉపాధ్యాయులంతా చీపురు ప‌ట్టుకుని క‌లెక్ట‌రేట్ ఎదుట రోడ్లు తుడుస్తూ త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసారు.ఈ సంద‌ర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నేత రాము మాట్లాడుతూ ఓవైపు ఖాళీగా  ఉన్న టీచ‌ర్ల‌ను భ‌ర్తీ చేయ‌కుండా..ఉన్న టీచ‌ర్ల‌ను స‌రిగ్గా పాఠాలు చెప్ప‌నీయ‌కుండా యాప్ లో ఫోటోలు అప్ లోడ్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వ‌డం ప‌నికిమాలిన చ‌ర్య  అని విమ‌ర్శించారు. త‌క్ష‌ణం యాప్ ల‌లో అప్ లోడ్ విధానాన్ని విర‌మించుకోవాల‌ని డిమాండ్ చేసారు.

Related posts

Analysis: రూపాయీ, ఇక లే, కరోనాను వదిలించుకో

Satyam NEWS

బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన

Sub Editor

సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల బ్రేకప్?

Bhavani

Leave a Comment