30.2 C
Hyderabad
September 14, 2024 15: 37 PM
Slider కృష్ణ

అప్పులిచ్చిన వ్యక్తి రుణం తీర్చుకున్న జగన్

#jaganmohan

అడగంగానే అప్పులిచ్చే వారిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మనకు తెలియదు కానీ ఏపీ సీఎం జగన్ కు మాత్రం బాగా తెలిసినట్లు కనిపిస్తున్నది. అదీ కాకుండా మన సొంత కులం అయితే మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందనేది సిద్ధాంతంలాగా కనిపిస్తున్నది.

అసలు విషయానికి వస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు విలీనం అయిన విషయం తెలుసు కదా. అలా ఆంధ్రా బ్యాంకులో పై స్థాయిలో పని చేసిన బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి కూడా విలీనం తర్వాత యూనియన్ బ్యాంకుకు వచ్చేశాడు. అంతకు ముందు బ్రహ్మానందరెడ్డి చైతన్య గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పని చేశాడు. అక్కడ నుంచి ఆంధ్రాబ్యాంకు కు వెళ్లి ఆ తర్వాత యూనియన్ బ్యాంకులో విలీనంత తర్వాత ప్రమోషన్ పై సీజీఎం అయ్యాడు.

యూనియన్ బ్యాంకు కు వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం అడిగిందే తడవుగా కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చేశాడు. మనం మనం బరంపురం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దల నుంచి ప్రతిపాదనలు రాగానే యూనియన్ బ్యాంకు నిధుల్ని వేల కోట్లు అప్పనంగా అప్పులు ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇవేం అప్పులు అని ఆర్బీఐ హెచ్చరించడంతో… వెంటనే యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులు బ్రహ్మానందరెడ్డిని ఆ స్థానం నుంచి బదిలీ చేసి.. ముంబైలో ఓ అప్రాధాన్య పోస్టులో పడేశారు.

రిటైరయ్యే వరకూ అక్కడే ఉన్న ఆయన తిరిగి విజయవాడ వచ్చేశారు. మేలు చేసిన వారిని మర్చిపోని సీఎం జగన్ బ్రహ్మానందరెడ్డికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ లో పదవి కట్టబెట్టేసింది. అంటే బ్యాంక్ బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి సర్కర్ లో డిస్కమ్ బ్రాహ్మనందరెడ్డి అయ్యారు. జగన్ రెడ్డి తన అక్రమాలకు వంత పాడిన వాళ్లందరికీ తిలా పాపం తలా పిడికెడు అని పంచే తరహాలో ప్రయోజనాలు కల్పిస్తూనే ఉంటారు.

అది ఆయన సొమ్ము కాదు. ప్రజాధనం. ఔట్ సోర్సింగ్ పేరుతో బయట నుంచి తీసుకుని జీతాలిస్తున్న వేల మంది ఆయన కోసం.. అడ్డగోలు పనులు చేసిన వాళ్లే. వాళ్లకు వ్యక్తిగతంగా ఎప్పుడూ చెల్లింపులు చేయరు. ప్రజాధనాన్ని మాత్రం దోచి పెడుతూ ఉంటారు.

ఏపీ సర్కార్ అప్పులు తెచ్చేందుకు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడటం… అలా అప్పులిచ్చిన వారికి ప్రభుత్వంలోనే పదవులు ఇవ్వడం అసాధారణ వ్యవహరం. అలవి మాలిన అప్పులు చేసిన రాష్ట్రం… వాటి కోసం అడ్డదోవలు తొక్కింది. ప్రభుత్వం మారితే ఈ అప్పుల అక్రమాలపైనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related posts

డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించిన ప్రభుత్వ విప్

Satyam NEWS

కలెక్టరెట్ లో క్లీన్ అండ్ గ్రీన్

Bhavani

ఇంటిని విరాళంగా ఇచ్చేసిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

Satyam NEWS

Leave a Comment