Slider జాతీయం

పీఎం కేర్స్ నిధికి విశాఖపట్నం పోర్టు ట్రస్టు రూ.కోటి

#VizagPortTrust

సామాజిక బాధ్యత నిధుల నుంచి కోటి రూపాయలు, పోర్ట్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ 62,28,296 లు పీఎం కేర్స్ నిధికి  విరాళంగా ఇచ్చినట్టు విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ కే రామమోహనరావు తెలిపారు. పోర్టు నుంచి మొత్తం 1,62,28,296/_ రూపాయల మొత్తాన్ని పీఎం కేర్స్ నిధికి అందజేసినట్లు ఆయన వెల్లడించారు. మరో వైపు పోర్టు లో పదవీ విరమణ చేసిన అధికారుల సంక్షేమ సంఘం తరపున తమ బాధ్యతగా సంఘం సభ్యులు తమ పెన్షన్ నుంచి ఒక్కొక్కరు 1 వెయ్యి రూపాయలు అంద చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇందుకు సంబంధించి తమ పెన్షన్స్ నుంచి ఒక్కో సభ్యుడి తరపున 1000 రూపాయలు మినహాయించి ఆ మొత్తాన్ని పీఎం కేర్స్ నిధికి అందజేయాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పోర్టు డెప్యూటీ చైర్మన్ పి ఎల్ హరనాథ్ ను కలిసి విన్నవించారు. ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగులు వినతి మేరకు పీఎం కేర్స్ కు అందేలా చర్యలు తీసుకుంటామని డెప్యూటీ చైర్మన్ వెల్లడించారు.

Related posts

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువుల సరఫరా

Satyam NEWS

కాంగ్రెస్ నేత ఆఫీసులో ఎన్నికల అధికారుల సోదాలు

Satyam NEWS

2000 నోటుతో లాభ సాటి వ్యాపారం

Satyam NEWS

Leave a Comment