30.7 C
Hyderabad
May 5, 2024 06: 10 AM
Slider ప్రత్యేకం

రాజ‌ధాని పేరుతో విశాఖ అభివృద్దిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంది….!

#telugudesham

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో మంత్రి బొత్స ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని రెవిన్యూ డివిజ‌న్ గా ప్ర‌క‌టించాల‌ని  తెలుగు దేశం పార్టీ పార్ల‌మెంట‌రీ నేత కిమిడి నాగార్జున డిమాండ్ చేసారు. గ‌డ‌చిన  ఈ మూడ‌ళ్ల‌లో ఉత్త‌రాంధ్ర అభివృద్దికి చేసిన ప‌నులేమిటో మంత్రులు  స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో పార్టీ నేత‌ల‌తో క‌లిసి కిమిడి నాగార్జున మాట్లాడారు.

విశాఖపట్నాన్ని అభివద్ధి చేయకుండా రాజధాని పేరుతో డ్రామాలు ఆడుతున్నారని నాగార్జున ఆరోపించారు.అభివృద్ధి వికంద్రీకరణ కావాలి కాని……పాలన వికంద్రీకరణ కాద‌న్నారు.ప్ర‌స్తుతం ఏ ప్ర‌భుత్వ శాఖ‌లోనూ ఉద్యోగులు విధులను సక్రమంగా పనిచేయలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. పరిది దాటి వ్యవహరిస్తున్నారు కాబట్టే… న్యాయ వ్యవస్థ కూడా విశేష అధికారులతో  తీర్పు ఇచ్చిందని  నాగార్జున గుర్తు చేసారు.

ఇక  రాజ‌కీ ప‌రంగా కూడా అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ దాగుడుమూత‌లు ఆడుతోంద‌ని నాగార్జున విమ‌ర్శించారు. వివేక హత్య కేసు లో ఆధారాలు లేకుండా కుట్ర చేసినవారు ఎవరో కుటుంబసభ్యులకు తెలియదా ? చంద్రబాబు పై ఆరోపణలు చేయడం హాస్యస్పదమ‌న్నారు.

అస్స‌లు హత్య రాజకీయాలుకు చంద్రబాబు వ్యతిరేకమ‌ని…….ఇప్పటికైనా విచారణకి సహకరించాలని డిమాండ్ చేసారు.ఇక  ధ్యానం కోనుగోలు లో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని..ఇటీవ‌లే ఆ అంశంపై  మంత్రి బొత్స  మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన వుండద‌న్నారు. క్షేత్ర స్థాయిలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయని… ద‌ళారీలు, మిల్లర్లు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు క్వింటల్ దగ్గర 8 కేజీలు అధికంగా తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఇక కొత్త జిల్లాల ఏర్పాటుపై అమిత‌మైన ఆస‌క్తి చూపెడుతున్న మంత్రి బొత్స‌…త‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపురుప‌ల్లిని  రెవిన్యూ డివిజ‌న్ గా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేసారు.తమ ప్ర‌భుత్వ హాయంలోనే ర‌మార‌మి 40 ఏళ్ల కింద‌టే….చీపురుప‌ల్లి ని రెవిన్యూ డివిజ‌న్ గా చేయాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించామ‌న్నారు. ఈ అంశంలో మంత్రి  బొత్స కి వున్న చిత్తశుద్ధి ఏమిటో తెలియజేయాలని……ఎందుకు మంత్రి నోరు మెదపడం లేదని టీడీపీ నేత నాగార్జున ప్ర‌శ్నించారు.

Related posts

ఆడబిడ్డల కుటుంబాలలో వెలుగులు

Bhavani

ఉదారత చాటుకున్న ఏపీ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం

Bhavani

బలహీన వర్గాలు అభివృద్ధి కి ఉద్యమించిన మహాత్మా పూలే

Satyam NEWS

Leave a Comment