28.7 C
Hyderabad
April 27, 2024 05: 35 AM
Slider గుంటూరు

బలహీన వర్గాలు అభివృద్ధి కి ఉద్యమించిన మహాత్మా పూలే

#Dr.Chadalawada

మహాత్మా జ్యోతిరావు పూలే 130 వ వర్ధంతి గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాల కోసం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. చదువు అందరికీ ఎంతో అవసరమని గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి వ్యక్తి పూలే అని ఆయన తెలిపారు.

వితంతువులు వివాహాలు ప్రోత్సహించి సమాజంలో మహిళలు విద్యావంతులు కావలసిన అవసరాన్ని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారని డాక్టర్ చదలవాడ తెలిపారు. బడుగు,బలహీన వర్గాలు ఆర్ధికంగా,సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి  చెందలనే పూలే  ఆశయాన్ని అమలు చేసి చూపించిన మొదటి వ్యకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని ఆయన తెలిపారు.

దేశంలోనే మొదటిసారి బీసీ లకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి పూలే ఆశయాలను ఆంద్రప్రదేశ్ లో ఆనాడు ఎన్టీఆర్ అమలు చేసి చూపించారని చదలవాడ అన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రి, లీగల్ సెల్ అధ్యక్షులు చెన్నుపాటి నాగేశ్వరరావు,

వల్లెపు నాగేశ్వరరావు, కొట్ట కిరణ్, ఇమ్మడిశెట్టి కాశయ్య, మాన్నన్ షరీఫ్, గొట్టిపాటి జనార్ధన్ బాబు, కొల్లి బ్రహ్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, పాపారావు, మాజీ కౌన్సిలర్స్ కొలిపాక చంద్రశేఖర్, నాగజ్యోతి, సైదమ్మ, మాబూ, భాష, సుభని, మస్తాన్, బంగారం, బాజీ, నాగుర్, విరప్పయ్య, ఖాసీం, రమణ మూర్తి, శ్రీను, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుంది జాగ్రత్త

Satyam NEWS

ఢిల్లీ ఎయిమ్స్ లో కొత్త ఫంగస్ వ్యాధి.. ఇద్దరి మరణం

Sub Editor

కరోనా కారణంగా వేములవాడ ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment