30.7 C
Hyderabad
May 13, 2024 00: 16 AM
Slider ఆదిలాబాద్

ఐకేపీ (సెర్ప్) కార్యాలయం ఎదుట రాత్రి వేళలో విఓఏ ల సమ్మె

#VOA strike

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఐకేపీ (సెర్ప్) కార్యాలయం ఎదుట రాత్రి వేళలో విఓఏ ల సమ్మె 33 వ రోజు కొనసాగుతున్నది. కార్యాలయం ఎదుట వంట వార్పు చేసుకొని ఇక్కడే జాగారం చేయనున్నారు. కనీస వేతనం 26,000 పి ఎఫ్, ఈ ఎస్ ఐ ఉద్యోగ భద్రత, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

అర్హులైన విఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రతి రోజు రాత్రి సమయంలో కార్యాలయం ఎదుట జాగారం చేస్తామన్న విఓఏలు..రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఐకెపి వివో ఎలా సమ్మెలో భాగంగా 33వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఐకెపి వివో ఏలు వినూత్నంగా రాత్రి భోజనాలు ఒక్కడే చేసి బతుకమ్మలాడి అక్కడి చిన్నపిల్లలతో సహా అక్కడే రాత్రి సమ్మె శిబిరంలోనే నిద్రపోయారు.

సమ్మె శిబిరంలో నినాదాలతో హోరెత్తించి సమ్మె చేపట్టిన టెంట్ కిందే కాగజ్ నగర్ ఐకెపి వివో ఏలు ఇలాంటి రోజులు ఎన్నైనా ఎదుర్కొంటామని సమస్యలు తీరేవరకు వెనకడుగు వేయబమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై కనికరం చూపి కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఇందులో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రానున్న

రోజుల్లో ప్రగతి భవన్ ను సైతం ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అందుకు సమయంలో కనీస వేతనం 26,000 పి ఎఫ్, ఈ ఎస్ ఐ ఉద్యోగ భద్రత,సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ అరులైన విఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రతి రోజు రాత్రి

సమయంలో కార్యాలయం ఎదుట జాగారం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18,000 మంది ఐకెపి వివో ఏలు సిద్ధమవుతున్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం వీఆర్ఏలను ఎలా అయితే రెగ్యులర్ చేసి వారికి

భరోసా కల్పించారు ఆ దిశగా ఐకెపి వివో ఏ లను సైతం రెగ్యులరైజ్ చేసే దిశగా మరియు కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంకయ్య శ్రీనివాస్ వినోద్ వనిత గీత సంగీత సంధ్య ధనరాజ్ కళ్యాణి అంజలి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నూతన రెవెన్యూ బిల్లుకు ఆమోదంతో హర్షం

Satyam NEWS

ఇన్ సల్ట్: విలేకరులకు తీరని అవమానం

Satyam NEWS

డ్రంక్ & డెడ్:మంచంపై నుంచిపడి యువకుడు మృతి

Satyam NEWS

Leave a Comment