31.2 C
Hyderabad
May 3, 2024 00: 44 AM
Slider వరంగల్

ఓటు విలువ తెలుసుకోండి… ఓటు వేసేందుకు రండి

#anitareddy

నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన “ఓటు విలువ” అనే అంశంపై హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రయం లోని మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం తో హనుమకొండ అర్బన్ లో నూటికి నూరు శాతం ఓటింగ్ జరిగే విధంగా చేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఓటు మన హక్కు అని, ఓటు ఉండి కూడా వినియోగించు కోకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోవడమేనని అన్నారు. ఓటు విలువ తెలియడం లేదంటే నీ విలువ నీకు తెలియడం లేదని అర్థం అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.

ఓటుహక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలని  సూచించారు. మరుమూల్లో పోలింగ్ శాతం పెరుగుతుండగా  విద్యా వంతులు, మేధావులు ఉన్న అర్బన్ లో తక్కువగా నమోదవడం సిగ్గు పడే విషయం అని అన్నారు. ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదంటే సమాజంలో మంచి మార్పుని కోరు కోవడం లేదని అర్థం, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధంలాంటిదని దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు నిజమైన సేవ చేసే నాయకుడిని ఎన్నుకోనే విధంగా ప్రజలు చైతన్యవంతం కావాలని డాక్టర్ అనితా రెడ్డి సూచించారు. అనంతరం ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగ కుండా స్వేచ్ఛగా వేస్తామని డాక్టర్ అనితా రెడ్డి మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు.

Related posts

నాచారంలో ఘనంగా క్రిస్మస్ పండుగ సంబరాలు

Bhavani

మునుగోడు గెలుపే లక్ష్యంగా పువ్వాడ దళం

Murali Krishna

జూలూరుపాడు తహసీల్దార్ గా శారద

Murali Krishna

Leave a Comment