40.2 C
Hyderabad
May 2, 2024 15: 42 PM
Slider నెల్లూరు

ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ

#VenkatagiriMunicipality

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయం నుండి పట్టణ పురవీధుల గుండా ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్లను చైతన్యపరిచి ఓటు హక్కు పై వారికి అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.  గత మున్సిపల్ ఎన్నికల్లో వెంకటగిరి పట్టణంలో 71.93 శాతం ఓట్లు నమోదయ్యాయని, ఈసారి నూటికి నూరు శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.

ఓట్ల శాతం పెరగడం వల్ల ప్రజాస్వామ్య యుతమైన పాలన, అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. వెంకటగిరి నియోజకవర్గ SVEEP నోడల్ అధికారి & మున్సిపల్ డి ఈ మదర్సా అలీ మాట్లాడుతూ ఏప్రిల్ 17 న జరగబోయే ఎన్నికల్లో… కుడి చేతి వేలుకు మార్క్ పెడతామని అన్నారు.

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు వెంకటగిరి ఎమ్మార్వో వెంకట సునీల్, వెంకటగిరి ఎంపీడీవో నాగేంద్ర. AO సిహెచ్. విజయలక్ష్మి, MEO వెంకటేశ్వర్లు, మున్సిపల్ DE, నోడల్ అధికారి మదర్సా అలీ, విద్య,వైద్య అధికారులు, సిబ్బంది, పొదుపు మహిళలు, MEPMA సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కె.రమాకాంత్

Related posts

తాడిపూడి ఏపీఆర్ జేసీ పిల్లలు క్షేమం..

Satyam NEWS

శంకర్ నగర్ సమస్యలను కైలాస శంకరుడే తీర్చాలా

Satyam NEWS

జూన్ 17వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీ

Satyam NEWS

Leave a Comment