38.2 C
Hyderabad
April 29, 2024 20: 32 PM
Slider రంగారెడ్డి

అచ్చంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన వంశీ

#Dr. Vamsikrishna

అచ్చంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 మున్సిపాలిటీ ఎన్నికల్లో అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు లక్ష్మారెడ్డి 5వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం సీతరాలగుట్టలో శిలాఫలకాలు వేశారని, కాగా నేటి వరకు పూర్తి కాలేదని విమర్శించారు.

ప్రస్తుతం నిర్మించిన ఇల్లు 150 మాత్రమే నని అవి కూడా పూర్తిగా నాసిరకంగా నిర్మించారని ఇండ్లు ఏమాత్రం నాణ్యత లేదని తెలిపారు. ప్రస్తుతం నిర్మించిన ఇండ్లు కూడా 2017లో మొదలుపెట్టి ఇంతవరకు ఇంకా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయని తెలిపారు.

కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇక్కడ ప్లాట్లు ఉన్నటువంటి లబ్ధిదారులకు మొదటగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరగా పూర్తిచేసి వెంటనే అర్హులైన నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలని, గతంలో రాజీవ్ నగర్ కాలనీకి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ నగర్ కాలనీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ప్లాట్ఫారం అందజేశారన్నారు. ఈ రాజీవ్ నగర్ కాలనీ పై నాయకులకు ప్రజాప్రతినిధులు పూర్తిగా వివక్ష చూపుతూ ఎటువంటి మౌలిక వసతులు ఇంతవరకు కల్పించలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాగునీటి కోసం బోర్లు వేసామని గుర్తు చేశారు.

ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట పట్టణంలో నిర్మిస్తానన్న 5వేల డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని అదేవిధంగా అచ్చంపేటను అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని 2016 మున్సిపల్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకునే కార్యక్రమానికి ప్రయత్నం చేస్తున్నారని

విమర్శించారు. ప్రజలందరూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను పసిగట్టి గమనించి ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయాలని సూచించారు. అదేవిధంగా రాజీవ్ నగర్ కాలనీ తో పాటుగా డబుల్ బెడ్ రూములు నిర్మించినటువంటి అక్కడి వరకు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు తాగునీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురాం, కౌన్సిలర్ గౌరీ ఇతర పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫ్రాన్స్ తో ఎయిర్ ఇండియా భాగస్వామ్యం

Satyam NEWS

అష్టలక్ష్మీ మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

Satyam NEWS

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు…!

Satyam NEWS

Leave a Comment