28.7 C
Hyderabad
April 27, 2024 06: 48 AM
Slider రంగారెడ్డి

బిగ్ డేటా పై ఆన్ లైన్ లో సదస్సు

#data

13వ అంతర్జాతీయ విజ్ఞాన మరియు వినూత్న ఇంజినీరింగ్ 2023 సదస్సు చెన్నైకి చెందిన జవహర్ ఇంజనీరింగ్ కళాశాల నేడు ఆన్ లైన్ లో నిర్వహించింది. సి బి ఐ టి కళాశాల సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులు గా  హాజరై బిగ్ డేటా మరియు అనలిటిక్స్ గురించి వివరించారు. బిగ్ డేటా అనేది వివిధ మూలాధారాల నుండి డేటాను సేకరించడం, విశ్లేషకులచే వినియోగించబడేలా అందుబాటులో ఉండేలా చేయడం ప్రస్తుత అవసరమని ఆయన అన్నారు.

మన దేశం, ఇతర దేశ విద్యార్థులు, పరిశోధకులు వివిధ ప్రయోగ ఫలితాలు, వివిధ ఇంజనీరింగ్ అనువర్తనలు తెలియజేసారు. చివరకు సంస్థ వ్యాపారానికి ఉపయోగపడే డేటా ఉత్పత్తులను అందించడం వంటివి కలిగి ఉంటుంది అని తెలిపారు. ఈ బిగ్ డేటా లో  భద్రత అనేది ఇప్పుడు ఎంతో సంబంధించినది. ఈ రంగంలో అనేక అవకాశాలు వున్నాయి అని తెలిపారు. పెద్ద మొత్తంలో నిర్మాణాత్మకంగా లేని ముడి డేటాను మార్చే ప్రక్రియ, సంస్థలకు ఉపయోగపడే డేటా ఉత్పత్తికి వివిధ మూలాల నుండి తిరిగి పొందడం బిగ్ డేటా అనలిటిక్స్ ప్రధాన అంశం. పెద్ద డేటా అనలిటిక్స్ సైకిల్‌ను వ్యాపార సమస్య నిర్వచనం, పరిశోధన, మానవ వనరుల అంచనా ,డేటా సేకరణ, డేటా నిల్వ ,అన్వేషణాత్మక డేటా విశ్లేషణ ,మోడలింగ్ మరియు అసెస్‌మెంట్ కోసం డేటా తయారీ  అని తెలిపారు.

Related posts

విక్రమ్ ల్యాండర్ పై ఆశ వదులుకోవాల్సిందేనా?

Satyam NEWS

టాకీ పార్టు పూర్తి అయిన సూపర్ మచ్చి

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment