39.2 C
Hyderabad
May 3, 2024 12: 32 PM
Slider కరీంనగర్

మూడేళ్ల వయసుకే ఓటు హక్కు ఇచ్చేశారు

metuku nandita

స్థానిక సంస్థల ఎన్నికల లో ఓటు వేసేందుకు ఎంత వయసు ఉండాలి? మూడేళ్లు వయసు ఉంటే చాలు అంటున్నారు కరీంనగర్ జిల్లా అధికారులు. కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు. కరీంనగర్‌లో ఓటర్‌ ఐడీ వైఓజే 8588352 నంబర్‌పై నందిత మెతుకు పేరిట నమోదు అయింది.

నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్‌ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్‌ అవాక్కయ్యాడు. తమకూతురు నందిత వయస్సు 3ఏళ్లని, ఎల్‌కేజీ చదువుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి వెంటనే ఓటర్‌ లిస్ట్‌ నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు. 

Related posts

విశాఖ స్టీల్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం

Satyam NEWS

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Bhavani

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS

Leave a Comment