42.2 C
Hyderabad
May 3, 2024 18: 40 PM
Slider మహబూబ్ నగర్

హామీ ఇచ్చి ఐదేళ్లయినా అమలు చేయరేం సారూ?

#vraskollapur

పే స్కేల్ ఇస్తామని, పదోన్నతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్  హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయినా అతీగతీ లేదని తెలంగాణ VRA సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ VRA సంఘం పిలుపు మేరకు నేడు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయం లో VRA నిరసన తెలియజేశారు. 2017 ఫిబ్రవరి 24న మహా శివరాత్రి రోజుతెలంగాణ సీఎం ప్రగతి భవన్ లో VRA సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. VRA లకు పే స్కేల్, పదోన్నతులు కల్పిస్తామని ఆ సమావేశంలో హామీ ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు పూర్తి అయినా దాన్ని నెరవేర్చలేదు. అంతే కాకుండా 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ VRA లకు పే స్కేల్, పదోన్నతులు కల్పిస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. ఇలా రెండు సార్లు చెప్పినా ఇప్పటి వరకు అమలు కాకపోవడం శోచనీయమని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర VRA సంఘం పిలుపు మేరకు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో డైరెక్ట్ రిక్రుట్మెంట్ VRA జిల్లా జనరల్ సెక్రెటరీ నాగరాజు, వారసత్వ VRA జిల్లా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, స్వామి, కుమార్ గౌడ్, శివ, వెంకటస్వామి, వెంకట్, స్వరూప, రాధ, మంగమ్మ, శుక్రు, బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీ హైకోర్టు మార్పు ప్రతిపాదన లేదు

Satyam NEWS

ద‌ర్శ‌కేంద్రుడి `పెళ్లిసంద‌డి`కి 25 ఏళ్లు..

Sub Editor

జగన్ ప్రభుత్వంపై మరో కోర్టు ధిక్కార కేసు దాఖలు

Satyam NEWS

Leave a Comment