30.2 C
Hyderabad
October 13, 2024 16: 38 PM
Slider వరంగల్

రోడ్ టెర్రర్:గీసుకొండలో ముగ్గురు యువకుల మృతి

geesukonda accsident 3 dead

వరంగల్‌ గ్రామీణ జిల్ల్లాలో ఘోరం జరిగింది .ముగ్గురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొనడం తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పలువురిని కలిచివేసింది. వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటనజరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్‌(19), న్యాల నవీన్‌(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21) ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్‌ నుంచి గంగదేవిపల్లికి వెళుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గంగదేవిపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో వాహనంపై ఉన్న ముగ్గురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలొదిలారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.ఇద్దరు యువకుల మృతి తో గంగాదేవిలల్లి లో విషాదం నెలకుంది.

Related posts

పోలీసులనే బ్లాక్ మెయిల్ చేసిన దంపతులు

Satyam NEWS

చంద్రబాబు అరెస్టు తీవ్రంగా ఖండించిన మచిలీపట్నం విద్యార్థులు

Bhavani

దేవుడి స్క్రిప్టు మారుస్తున్న సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment