డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి వెళ్లే క్రమంలో ఒక మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. కృష్ణ జిల్లా మైలవరంతో ఈ సంఘటన జరిగింది. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన పొట్లూరి మరియమ్మ ప్రసవ వేదనతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దాంతో ఆమె ను వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కన పురిటినొప్పులు అధికమైనాయి.
దాంతో కొందరు మహిళలు సహకరించగా ఆమె నడిరోడ్డుపైనే ప్రసవించింది అంబులెన్స కు ఫోన్ చేయగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు లేకపోవడం సిబ్బంది ప్రసవ వేదనతో ఉన్న మహిళను వెనక్కి పంపించటం సరైంది కాదని ఏ ప్రభుత్వాలు వచ్చిన ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నాయని ప్రజలు అంటున్నారు.