28.7 C
Hyderabad
April 27, 2024 06: 39 AM
Slider నల్గొండ

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను భారతీయ ప్రజలు వ్యతిరేకించాలి

#HujurnagarCITU

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని దేశవ్యాప్తంగా 2 రోజులు సమ్మె విజయవంతమైందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సమ్మెకి మద్దతుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తమ నిరసన తెలిపారు.ఈసందర్భంగా రోషపతి మాట్లాడుతూ జన ధన్ ఖాతలో లక్షల రూపాయలు పడతాయని ప్రజలకి ఆశచూపి మోడీ మేసం చేశారని ఆరోపించారు.

అంబాని లాంటి వారికి బ్యాంకులను అప్పజెప్పడం ఇది ఎక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.భారతీయ ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిలదీయాలని అని అన్నారు‌.ప్రజలంతా ఈ పోరాటంలో పాల్గొని ప్రభుత్వం చేసే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, బ్యాంకు ఎంప్లాయిస్ కూడా నిరవధిక పోరాటానికి సమాయత్తం కావాలని కోరారు.

బ్యాంకుల ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజావ్యతిరేక కార్మిక సంస్కరణలు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని, ప్రజలకు మేలు చేసే బ్యాంకులను కాపాడాలని, ప్రజల సొమ్ముని కాపాడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎలక సోమయ్య గౌడ్, మెరుగు దుర్గారావు, పద్మ, కుమారి, సైదులు, రవి, గోపి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Related posts

న‌కిరేక‌ల్ పట్టణ సుంద‌రీక‌ర‌ణ చేయడమే లక్ష్యం

Sub Editor

AP Special: దేశంలోనే తొలిసారి గ్యాస్ సిలెండర్ లో గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

టీటీడీ ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా కిట్ ల పంపిణి

Satyam NEWS

Leave a Comment