37.2 C
Hyderabad
April 26, 2024 21: 29 PM
Slider నల్గొండ

పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలకు వినూత్న రీతిలో నిరసన

#CITUHujurnagar

పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని, రవాణా రంగంలోని కార్మికులకు నెలకి 7500 రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం ఒక సంవత్సరం ఇవ్వాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం CITU రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పాత బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు ఆటోలకి తాడు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా రోషపతి మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, జీఎస్టీ పరిధిలోకి తేవాలని అత్యవసర సేవలు అందించే రవాణా కార్మికులకు 50 లక్షల భీమా సౌకర్యం కల్పించాలి, మోటార్ చట్టం వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టం సవరణ నిలుపుదల చేయాలని, ఆటో కార్మికుల ఫైనాన్స్ ఒక సంవత్సరం వాయిదా వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యలక సోమయ్య గౌడ్, ఆటో కార్మికుల అధ్యక్షుడు పిట్టల బాలు, రాంబాబు, నాగరాజు, హనుమంతరావు, శీతల చందు, నాగరాజు, విశాల తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామరాజ్యం కావాలా..? రాక్షస రాజ్యం కావాలా..?

Satyam NEWS

మోక్షజ్ఞ ఎంట్రీ దసరా నుంచేనా ??

Bhavani

మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అనుమతివ్వండి

Satyam NEWS

Leave a Comment