29.7 C
Hyderabad
May 3, 2024 06: 16 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి అవినీతి, అభివృద్ధిపై విచారణకు సిద్ధం:చిన్నారెడ్డి

#chinnareddy

వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అభివృద్ధిపై విచారణకు తేదీ, వేదిక ప్రకటిస్తే వస్తామని మాజీ మంత్రి చిన్నారెడ్డి చెప్పారు. వనపర్తిలో అయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో నాలుగు పార్టీలు మారి, అధికారం ఉన్న దగ్గర ఉన్న వ్యక్తి అభివృద్ధిపై చర్చకు రావాలని పిలవడం తగదని, అదే సమయంలో అవినీతిపై చర్చకు రావాలని చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే పాలన,2014 కంటే ముందు, తర్వాత చిన్న నాయకుల నుండి పెద్ద నాయకుల ఆస్తులపై, అవినీతి, అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు. తాను వనపర్తిలో అభివృద్ధి చేసామని, కాలేజీలు, పాఠశాలలు ఏర్పాటు చేయించామని, త్రాగు నీరు, సాగునిటీ ప్రాజెక్టులు వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో కబ్జాలు, దేవుని భూములు కబ్జా, వనపర్తిలో పీర్లగుట్ట త్రవ్వారాని,చెరువులపై మినీ ట్యాంక్ బండ్ పేరుతో త్రవ్వి ప్రభుత్వ ఖజానా స్వాహా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టిఆర్ఎస్ నాయకుల అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపుతామని చెప్పారు. పానగల్ మండలం కొత్తపేట, పెద్దమందడి మండలం వెలటూరు, పెద్దమునగాలచెడు, బుద్దారంలో భూములు కొన్నారని, ఎర్రమట్టి, నల్ల మట్టి మాయం చేశారని అయన విమర్శించారు. వనపర్తిలో తాళ చెరువుకు ఎస్ఎన్ఆర్ పేరు పెట్టుకోవడం గొప్ప కాదని, వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ (మామ) పేరు పెట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డిని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఉందని చెప్పారు. కృష్ణా నది కబ్జా గురించి బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారని తెలిపారు. గెస్ట్ హౌస్ పునర్నిర్మాణం పేరుతో కోటి రూపాయలకు పైగా బిల్ చేశారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ చెప్పారు. స్థాయి గుర్తు చేసుకుని మాట్లాడాలని అయన కోరారు. పద్ధతి మార్చుకోకుంటే ఇండ్లు, కార్యాలయాలు ముట్టడి చేస్తామని అయన హెచ్చరించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పార్టీ సమావేశంలో విజయనగరం మేయర్ కు అవమానం

Satyam NEWS

ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల వ్యవస్థకు న్యాయం చేయండి

Satyam NEWS

పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రాజీనామా చేస్తారా ?

Satyam NEWS

Leave a Comment