39.2 C
Hyderabad
May 3, 2024 14: 55 PM
Slider తూర్పుగోదావరి

తోలుబొమ్మలాట కళాకారులను ఆదుకుంటాం

ప్రాచీన పురాణ, ఇతిహాస కథలను తోలుబొమ్మల ప్రదర్శనల ద్వారా తెలియజేసే కళల ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో దీనిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వపరంగా ఆదుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు.

బుధవారం తోలు బోమ్మ కళాకారులు రామచంద్రపురం లోని మంత్రి నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతిహాసాలను తోలుబొమ్మల తో చక్కటి నైపుణ్యంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రచార కర్తలుగా పేరుపడ్డ తోలుబొమ్మ కళాకారుల ఆదుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వపరంగా ఇప్పటికే అమ్మఒడి, విద్యాదీవన, వసతి దీవన, గోరుముద్ద లాంటి పథకాల ద్వారా పిల్లలకు ఆదుకోవడం జరుగుతుందని, మహిళలకు 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఈ కుటుంబాల కనీస ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో గుర్తించి ఆ విధంగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తోలుబొమ్మ కళాకారుల జనన గణన ప్రక్రియ దశలో ఉందని ఎంత మంది సమాజంలో ఉన్నారు గుర్తించి వారి అభివృద్ధికి తగిన విధముగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రాచీన ఇతిహాస చరిత్రను చెప్పే ప్రచార కళాకారులుగా గుర్తింపబడిన వీరి వృత్తిని రాబోయే తరాలవారికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా వారు కోరిన విధంగా చేపట్టడం జరుగుతుందన్నారు. తోలుబొమ్మ కళాకారుల కుల దృవీకరణ పత్రాలు జారీ చేసే విధంగా సమాచార శాఖ కార్యదర్శి తో చర్చించినట్లు మంత్రి ఈ దర్భంగా తెలిపారు. బీసీ కులాలలో అత్యంత వెనుకబడిన వారిగా తోలుబొమ్మ కళాకారులు ఉన్నారన్నారని, నుకబడిన తరగతుల ఆత్మ స్థైర్యం పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వీరి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి తగు విధముగా న్యాయం చేకూర్చే విధంగా కృషి చేస్తానని మంత్రి చెల్లుపోయిన తెలిపారు.

Related posts

ఆక్సిజన్ కోసం విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ

Satyam NEWS

ప్రివిలేజి మోషన్ పై సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీ

Satyam NEWS

శిరోముండనం కేసులో ఎస్ ఐపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

Leave a Comment