వెర్రి పలురకాలు అంటారు పెద్దలు.అలాగే ప్రజలను ఆకట్టు కోవాలనే ఆలోచనతో ఈ కొత్త వెర్రి కి కారణమయ్యారు ఇక్కడి యువకులు.ఇంతకీ వారు ఏంచేశారంటే నిత్యానంద ఫోటోతో కూడిన బ్యానర్ ను ఏర్పాటు చేసి వివాహానికి ఆహ్వానిస్తూ అందరి ద్రుష్టి తమవైపు తిప్పుకున్నారు.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో, ఆయన ఫొటోతో ముద్రించిన పెళ్లి బ్యానర్ కలకలం రేపింది.
తిరుచ్చి జిల్లా లాల్గుడి సమీపంలోని పల్లవపురం గ్రామానికి చెందిన వధూవరులకు వాల్పారై లోని కల్యాణమండపలో వివాహం జరిగింది.వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొందరు యువకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. అందులో నిత్యానంద ఫొటో ఉండడం వివాదాస్పదమైంది.
దీనిపై బ్యానర్ పెట్టిన యువకులు మాట్లాడుతూ, ప్రజలను ఆకట్టు కోవాలనే ఆలోచనతో నిత్యానంద ఫోటోతో కూడిన బ్యానర్ ముద్రించామని, ఆయన సిద్దాంతాలు, చురుకుదనం తమకు నచ్చిందని వారు వివరించారు.మొత్తని ఆ యువకుల వెర్రి ,ఆకట్టుకోవాలని ఆలోచన జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కి వారు విజయవంతమయ్యేట్లు చేసింది.