28.7 C
Hyderabad
April 26, 2024 07: 00 AM
Slider సినిమా

రాజ‌రాజ చోర‌తో మ‌రింత గుర్తింపు వ‌స్తుంది: న‌టి సునైన

#sunaina

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్ర‌యిల‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి.

హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌విష్ణు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం రాజ‌రాజ చోర‌. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 19న విడుద‌ల‌వుతున్న రాజ‌రాజ‌చోర‌లో మేఘా ఆకాష్‌,  సునైన హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా క‌థానాయిక సునైన  చిత్ర విశేషాల‌ను  పంచుకున్నారు.

ఇది నా డ‌బ్యు మూవీ కాదు. గ‌తంలో టెన్త్ క్లాస్‌, నారింజ మిఠాయి. సంథింగ్ స్పెష‌ల్‌, పెళ్లికి ముందు ప్రేమ‌క‌థ చిత్రాల‌లో న‌టించాను. అయితే ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల‌లో నాకు మంచి గుర్తింపు  వ‌చ్చింది. త‌మిళంలో నేను న‌టించిన చిత్రాల‌కు కొన్ని అవార్డులు కూడా వ‌చ్చాయి.

చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను రాజ‌రాజ చోర చిత్రం ద్వారా క‌లుసుకునే భాగ్యం క‌లిగింది. ఈ మూవీలో నాకు ప్రాముఖ్య‌త ఉండే పాత్ర‌నే ఇచ్చారు. ఈ మూవీలో ఒక లాయ‌ర్‌గా  న‌టించ‌బోతున్నాను. లాయ‌ర్‌గా కామెడీని పండించానా లేక సీరియ‌స్సా అనేది స‌స్పెన్స్‌. సినిమా చూశాక మీరే చెప్పాలి. నా పాత్ర న‌చ్చ‌డంతో ఓకే చేశాను.

నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా కాస్ట్‌లీగా తీశారు. ద‌ర్శ‌కుడు హ‌సిత్ గోలి మంచి ట్యాలెంటెడ్. త‌న‌కు ఏం కావాలో, ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్స్ కావాలో ద‌గ్గ‌రుండి చేసి చూపించారు. లాయ‌ర్ క్యారెక్ట‌ర్ నాకు పూర్తిగా కొత్త‌. అయితే ద‌ర్శ‌కుడు ఇచ్చిన ప్రోత్సాహంతో కొన్ని స‌న్నివేశాలు క‌ష్ట‌మే అయినా చ‌క్క‌గా చేశాను. ఈ మూవీ త‌ర్వాత నాకు మ‌రింత గుర్తింపు వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను.

ఇక హీరో శ్రీ‌విష్ణు చాలా డీసెంట్‌. సెట్లో త‌క్కువ మాట్లాడ‌తారు. మ‌ల్టీ టాలెంటెడ్ యాక్ట‌ర్‌. తెలుగులో గ్యాప్ రావ‌డానికి త‌మిళంలో బిజీగా ఉండ‌ట‌మే కార‌ణం. మ‌ల‌యాళంలో కూడా న‌టించాల‌ని కోరిక‌. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా ఉప‌యోగించుకుంటాను.

తెలుగులోనూ నాకు ప్రాధాన్య‌త ఉండే పాత్ర ల‌భిస్తే  త‌ప్ప‌క చేస్తాను. నేను న‌టించే ప్ర‌తి చిత్రంలో ఏదో ఓ కొత్త‌ద‌నం ఉండాల‌ని ఆశిస్తాను. నాగపూర్ నేప‌థ్యంనుంచి వ‌చ్చినా తెలుగు, త‌మిళం బాగా నేర్చుకున్నాను. తెలుగులో నా పాత్ర‌కి నేనే డ‌బ్బింగ్ చెప్పుకుంటానికి ఇష్ట‌ప‌డ‌తాను.

Related posts

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛ లేదు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం లా అండ్ ఆర్డ‌ర్ డీఎస్పీగా త్రినాధ్ నియాక‌మం

Satyam NEWS

రూ.2426.39 కోట్లు తో వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో టెక్నాలజీ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment