26.7 C
Hyderabad
May 3, 2024 08: 22 AM
Slider హైదరాబాద్

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ప్రయత్నిస్తా

#amberpet

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నిజమైన అర్హులందరికీ అందేలా తనవంతు ప్రయత్నం చేస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టం చేశారు. శనివారం అంబర్పేటకు చెందిన కొందరు మైనార్టీ మహిళలు, వికలాంగులు గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి షాదీ ముబారక్, పింఛన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు ఇప్పించాల్సిందిగా కోరారు.

దీనికి స్పందించిన ఎమ్మెల్యే తన వద్దకు వచ్చిన అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ముందుగా షాదీ ముబారక్, పింఛన్ల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ పింఛన్లు చాలామందికి ఇప్పించినట్లు వెల్లడించారు. అలాగే వికలాంగులకు ట్రై సైకిల్ కూడా ఇప్పిస్తానని చెప్పారు.

సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అభివృద్ధి పనులను కూడా ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే డ్రైనేజీ, మంచినీటి, వర్షపునీటి పైపులైన్లతో పాటు సిసి, బిటి, వీడిసిసి రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను సిఆర్ఎంపి నిధులతో అందంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. సుమారు 10 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని పార్కులను సుందరీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా, ఎక్కడైనా ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రామారావు యాదవ్, ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

జగన్ క్యాబినెట్: ఒకరిద్దరు తప్ప అందరూ అవుట్

Satyam NEWS

వెలుగు పువ్వులు

Satyam NEWS

సుదీర్ఘమైన సేవలతో శాఖకు వెన్నుద‌న్నై నిలిచారు

Satyam NEWS

Leave a Comment