29.7 C
Hyderabad
May 3, 2024 06: 31 AM
Slider వరంగల్

అత్యాచార బాధిత మహిళలు బాలికలకు భరోసా కల్పిస్తాం

#MuluguCollector

అత్యాచార బాధితులకు పునరావాసం కల్పిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య తెలిపారు.

బుధవారం నాడు  జిల్లా కలెక్టరేట్  ఆడిటోరియం లో అత్యాచార బాధితులకు ఆర్థిక సహాయం అందించే అంశం పై జిల్లా స్థాయి అట్రాసిటీ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 25 కేసులకు గాను 26 మంది బాధిత మహిళలు, బాలికల వివరాలను పరిశీలించామని తెలిపారు.

అర్హులైన  ప్రతి బాధితురాలికి పునరావాసం కోసం ఆర్ధిక సహాయం అందించాలని ఆయన ఆదేశించారు.  

ఈ విషయంపై సత్వరచర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని  ప్రేమలత ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కమిటీ ని ఉద్దేశించి జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ బాధితులకు ఎఫ్. ఐ.అర్.,ఛార్జ్ షీట్,మెడికల్ రిపోర్ట్ ఆధారంగా అడ్జిమెంట్  కాపీల ఆధారంగా పునరావాస ఆర్థిక సహాయం ఇస్తామని తెలిపారు.

ఈ  కమిటీ సమావేశం లో   ITDA ప్రాజెక్టు అధికారి హన్మంతు కే జడ o గే, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, కమిటీ సభ్యులు ASP సాయి చైతన్య,  DMHO అప్పయ్య, ఎస్ సి సంక్షేమ అధికారి భాగ్య లక్ష్మి, బిసి సంక్షేమ అధికారి లక్ష్మణ్,  DRDO పారిజాతం, విద్యాశాఖాధికారి సుదర్శన్, మతా పిత వెల్ఫేర్ సొసైటీ NGO ప్రెసిడెంట్ సందబాబు, BRB కో ఆర్డినేటర్ స్వాతి, DCPO ఓంకార్, చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కే.మహేందర్ గౌడ్,సత్యం న్యూస్

Related posts

జడ్పీటీసీపై దాడి జరగలేదు

Satyam NEWS

ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

ఉత్సాహంగా శ్రీకాకుళం జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు

Satyam NEWS

Leave a Comment