40.2 C
Hyderabad
May 6, 2024 17: 51 PM
Slider తూర్పుగోదావరి

వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసిన మేలు ఏమిటి?

వైసీపీ కాపు నేతలకు హఠాత్తుగా కాపులపై ప్రేమ పుట్టుకు వచ్చిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు. కోనసీమ జిల్లాలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మూడున్నర సంవత్సరాల తర్వాత కాపుల పరిస్థితులు కాపులు గుర్తుకొచ్చారా.? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తే అది కాస్త తీసివేసి మరి గొప్పలు చెబుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. గుంపుగా వచ్చి మీరు చెప్పింది ఏమిటంటూ మెట్ల ప్రశ్నించారు. పార్లమెంట్ కు 5 శాతం రిజర్వేషన్ బిల్లు పంపితే ఇప్పటి వరకు పెదవి విప్పని ఈ నేతలు కాపుల కోసం మొసలి కన్నీరు కాస్తున్నారన్నారు.

కాపు నేస్తం అంటూ ఒక పధకం ఇచ్చి మిగిలిన పథకాలను దూరం చేస్తున్నారన్నారు. మా నేత హయాంలో కాపులకు ఇచ్చినది మీకు తెలియదా అంకెలు గారిడితో కాపు సోదరులను మభ్యపెట్టాలని చూస్తున్నారని రమణబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలదన్న మాటలు మీలో ప్రకంపన సృష్టిస్తున్నాయని ఆయన చెప్పారు.

రంగా హత్య తో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సంబంధం లేదని ఆయన కుమారుడు చెప్పినప్పటికీ పదేపదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మెట్ల మండిపడ్డారు. ఈ సమావేశంలో కోనసీమ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామి నాయుడు, పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్,పట్టణ టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, వలవల శివరావు, మాజీ జడ్పీటీసీ అధికారి జయవెంకటలక్ష్మి, అధికారి బాబ్జి, రాష్ట్ర నాయకులు కర్రి దత్తుడు, దేశం నాయకులు బోనం సత్తిబాబు, కౌన్సిలర్ చిక్కాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ వ్యవసాయం

Satyam NEWS

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

పిఎసీఎస్ లలో అవినీతి, అక్రమాలపై సి.బి.ఐ విచారణ జరపాలి

Satyam NEWS

Leave a Comment