27.7 C
Hyderabad
April 30, 2024 07: 56 AM
Slider ముఖ్యంశాలు

ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ వ్యవసాయం

#MalluBhatti

కార్పొరేట్ వ్యవసాయం వల్ల దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖముఖిలో భాగంగా తాండ్ర గ్రామ రైతులతో భట్టి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భట్టితోపాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీ కృష్ణ, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రైతులతో ముఖాముఖిలో భాగంగా భట్టి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలలో దేశ రైతాంగం మొత్తం అతలాకుతలం అవుతోందని అన్నారు. ఢిల్లీలో రైతులు ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాన్ని కేసీఆర్ చేసిన ప్రకటన తరువాత తెలంగాణా రైతాంగం కూడా ఆందోళనలో ఉందని అన్నారు. రైతులకు గిట్టుబాటు, మద్దతు ధర కూడా లేదని అన్నారు. ప్రశ్నిస్తే పోలీసుల చేత ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేరని విమర్శలు చేసారు. రైతుల, ప్రజల సమస్యలు తెలుసుకుని శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే కాంగ్రెస్ శాసన సభాపక్షం రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేస్తోందని అన్నారు.

కేంద్రం తెచ్చిన నల్ల చట్టలతో దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని భట్టి మీడియాకు చెప్పారు. ఈ చట్టాలు ఇలాగే కొనసాగితే వ్యావసాయం మానేసి పట్నంపోయి కూలీలుగానో.. లేక అడుక్కుతినడమో చేయాలని రైతులు చెప్పిన మాటలపై భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల దగ్గర పంట ఉంటే ధర ఉండడం లేదు..

అదే వ్యాపారుల దగ్గర ఉంటే ధర అమాంతం వస్తోందన్న మరో రైతు మాటలను భట్టి చెప్పారు. నారాయణ్ ఖేడ్ దగ్గర ఒక పొలంలో టమాటా పంట బాగా పండింది.. కానీ మార్కెట్ లేదు.. ధర లేదు.. అమ్మాలంటే కొనేవాడు వాడు లేదు.. అందుకే ఈ పంటను ఏమీ చేయలేక.. కళ్ళ కింద తొక్కేస్తున్నా.. ఈ చట్టాలు అమల్లోకి వస్తే రైతుల పరిస్థితి ఇంతే అన్న రైతు ఆవేదనను భట్టి వివరించారు.

ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరూ.. ప్రజల కోసం పాలన చేయడం లేదని అన్నారు. బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదాని, అంబానీ కోసమే మోడీ పని చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టేలా మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి పడుతుందని అన్నారు.

కేంద్రం తెచ్చిన నల్లచట్టాలు అమల్లోకి వస్తే రైతులు పండించిన పంటను వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనేసి.. నిత్యావసర వస్తువులు నిలువ చేస్తే చివరకు వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం రిక్తహస్తం

Satyam NEWS

దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి

Murali Krishna

మనాలిలో షూటింగ్ జరుపుకుంటున్న అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’

Satyam NEWS

Leave a Comment