28.7 C
Hyderabad
May 5, 2024 10: 02 AM
Slider నెల్లూరు

మహిళల్లో పెరుగుతున్న ఆత్మస్థైర్యం: ఎంపీ ఆదాల

#adala

ప్రస్తుతం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని చూస్తుంటే ఎంతో ఉన్నతి కనిపిస్తోందని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. 1997 ప్రాంతంలో రాజకీయ సభలు, సమావేశాల్లో మహిళలు కనిపించేవారుకాదని, ఇప్పటి పరిస్థితి మాత్రం పూర్తిగా అందుకు భిన్నమని కొనియాడారు. పరమేశ్వరి కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం జరిగిన వైయస్ ఆసరా మూడో విడత సంబరాల్లో ఎంపీ ఆదాల, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని కొనియాడారు. తన పాదయాత్ర సమయంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను గమనించి, వైయస్ ఆసరా మూడో విడత రుణ మొత్తాన్ని  చెల్లించారని తెలిపారు. రాష్ట్రం విడిపోవడం, కోవిడ్ మహమ్మారితో ఎంతో నష్టం జరిగినా, ఎక్కడా వెనకడుగు పడలేదన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ మహిళలకు పెద్దపీట వేశారని, పదవుల్లోనూ సగభాగం వారికి కేటాయించారని పేర్కొన్నారు. మహిళలపైనే సీఎం జగన్ తన నమ్మకాన్ని పెట్టుకున్నారని, మహిళలు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు.

మహిళలు పిల్లలను చక్కగా చదివించి వృద్ధిలోకి తేవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరింతగా చేయూతనిచ్చేందుకుగాను మీ ఓటుతో  సీఎం జగన్ ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్యకు 5.74 కోట్ల రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మహిళల గురించి చక్కగా మాట్లాడారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నరసింహకొండ దేవస్థానం చైర్మన్ సురేందర్ రెడ్డి, జడ్పిటిసిలు, సర్పంచులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, హరిబాబు యాదవ్, సన్నపురెడ్డి పెంచల్రెడ్డి, తాటిపర్తి వెంకటేష్  కూడా  పాల్గొన్నారు.

Related posts

మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం..

Sub Editor

రీచా చద్దా పై వివాదాస్పద వార్తలు ప్రసారం చేయవద్దు

Satyam NEWS

ది ఎండ్: అవినీతికి పాల్పడిన సిఐ సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment