40.2 C
Hyderabad
May 5, 2024 18: 47 PM
Slider విజయనగరం

తప్పెవరిది.. ఆర్టీసీ బస్సు దా..? సిబ్బంది దా…?

#rtcbus

ఒక నిర్లక్ష్యం తో సిబ్బంది పనితనం బయటపడుతుంది..ఒక అశ్రద్ధతో శాఖ వ్యవహారం వెల్లడవుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు ఆర్టీసీ బస్సులు కారణం గా చిటికెలో పెను ప్రమాదం తప్పినట్లైంది.వివరాల్లోకి వెళితే నిన్న అనకాపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు నగర శివారు లో డీజిల్ లేకపోవడంతో ఆగిపోగా…తాజాగా మరో ఆర్టీసీ బస్సు… బ్రేక్ ఫెయిల్ అవడమే కాక రాంగ్ రూట్లో వచ్చి ఏకంగా పోలీసు బీట్ ను డీ కొట్టి ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్షణాలలో అక్కడే డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ హరి..క్షణం లో కళ్లముందు ఘటన జరగడంతో.. మెరుపు వేగంతో వెళ్లడంతో ఓ ప్రాణం కాపాడగలిగారు.

ప్రతీ రోజూ ట్రాఫిక్ విధులలో భాగంగా డీఎస్పీ కేటాయించిన బీట్ లలో ట్రాఫిక్ సిబ్బంది అంతా ఎవరికి వారు ఆయా బీట్లలో ఉదయం ఏడు గంటల నుంచీ ట్రాఫిక్ క్రమబధ్ధీ కరణలో నిమగ్నమై ఉంటారు. అయితే  29 వ తేదీ న పోలీసు బాస్ ఎస్పీ దీపికా.. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుమల హాస్పిటల్ నిర్వహించే ఓ కార్యక్రమంలో భాగంగా కోట జంక్షన్ వద్ద ర్యాలీ లో పాల్గొని తిరిగి తన బంగ్లా కు వెళ్లే సందర్భంలో ట్రాఫిక్ సిబ్బంది అయిన శ్రీను ప్రసాద్, హరి ,విజయ్ తదితరులు అంతా ఎవరి బీట్లలో వారు ఉండి ట్రాఫిక్ ను క్రమబధ్ధీ కరించారు.

మరో కొద్ది గంటల్లో ఎత్తు బ్రిడ్జి నుంచీ ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి..సరాసరి రాంగ్ రూట్లో..మయూరీ జంక్షన్ వద్ద సిగ్నల్ ఉన్నప్పటికీ..రయ్యూ..రయ్యూ మంటూ వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు గా ఉండే పోలీసు బీట్ ఢీ కొట్టి..అక్కడే ఆగిపోయింది. క్షణాల్లో ట్రాఫిక్ సిబ్బంది తేరుకుని ట్రాఫిక్ జామ్ అయినా…శరవేగంగా పునరుద్దరించారు..అక్కడే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి శభాష్ ట్రాఫిక్ పోలీసు అని అనిపించుకున్నారు.

సీన్ కట్ చేస్తే…నిన్న అనకాపల్లి బస్సు తాజాగా విజయనగరం బస్సు రెండు బస్సు లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి.అనకాపల్లి బస్సు గ్యారేజ్ నుంచీ బయలు దేరితే..సిబ్బంది ఫిట్నెస్ చూడలేదా..?విజయనగరం బస్సు విషయం లో బ్రేక్ ఫెయిల్ అయిన విషయంలో ఆర్టీసీ ది తప్పిదం ఉందా…?ఈ రెండు ఘటనలకు కారణాలను శాఖా ఉన్నతాధికారులు తెలియ చెప్పాలి.  అని  అంటోంది  స‌త్యం న్యూస్.నెట్.

Related posts

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక సవాల్

Satyam NEWS

మంత్రి మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేల బహిరంగ పోరాటం

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

Leave a Comment