39.2 C
Hyderabad
May 3, 2024 12: 11 PM
Slider మహబూబ్ నగర్

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

#ApoorvaraoIPS

పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు  సూచించారు.

శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సందర్భంగా వనపర్తి జిల్లా పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో  సంగం పంక్షన్ హాలులో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు  సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, పోలింగ్ ముగిసిన తర్వాత పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ కు తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

ముఖ్యంగా సమస్యాత్మక,  కేంద్రాల వద్ద పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలోని సిసి కెమెరాల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.

బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కడైనా సమస్య తలెత్తితే నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 31 పోలింగ్ కేంద్రాలకు గాను 06 రూట్లను ఏర్పాటు చేసి 250 మంది  సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అదనపు ఎస్పీ౼1, డిఎస్పీలు ౼ 01, సిఐలు  ౼ 04, ఎస్సైలు ౼ 18, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్,  మహిళా కానిస్టేబుల్స్, హోమ్ గార్డులతో పాటు  ఏ.ఆర్. సిబ్బంది మొత్తం 250 మంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ  వివరించారు.

పోలింగ్ ప్రశాంత నిర్వహణలో ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  వనపర్తి డిఎస్పీ,కె యం. కిరణ్ కుమార్, సీసీఎస్ సీఐ, శ్రీనివాస్, కొత్తకోట సీఐ, మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూర్ సీతయ్య, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

బ్లాక్ దందాకు అలవాటు పడ్డ బ్యాచ్ ఇది

Satyam NEWS

సంహారి మొదటి ప్రచార చిత్రం విడుదల చేసిన శంకర్

Satyam NEWS

నరసరావుపేటలో కరోనా ఆంక్షలు తీవ్రతరం

Satyam NEWS

Leave a Comment