27.7 C
Hyderabad
April 30, 2024 07: 25 AM
Slider ప్రత్యేకం

ఆంధ్రోళ్లను తిట్టిన నోటితో ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటున్నావ్?

#bandi

తెలంగాణ సెంటిమెంటు ను వాడుకొని వందల మంది యువకుల బలిదానాలను అడ్డంపెట్టుకొని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణా పదం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని  కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుధాకర్ గౌడ్ విమర్శించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వాటి ఆవశ్యకతపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో పుల్ల కూర పుంటి కూర అని అనప కాయ సొరకాయ అంటూ తెలంగాణ యువకులను రెచ్చగొట్టి, పన్నెండు వందల మంది యువకులు తమ నిండు ప్రాణాలను బలి తీసుకునేలా కెసిఆర్ రెచ్చగొట్టాడు అని మండి పడ్డారు. తెలంగాణ అమరుల ఆత్మ ఘోషించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అని సుధాకర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఆంధ్రోళ్లు వద్దు తెలంగాణ ముద్దు అని అధికారంలోకి రాగానే  అక్రమార్జన  ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ  తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నాడు అని విమర్శించాడు.  తెలంగాణ లో రోజు మూడు సీబీఐ కేసులు, ఆరు ఈడీ కేసుల విచారణలను కూడా ఎదుర్కొంటూ  తెలంగాణ పరువు తీస్తున్నాడు. తెలంగాణ నదీ జాలాలను నిధులను ఆంధ్రా వాళ్ళు దోచుకున్నారు అని చెప్పి తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కెసిఆర్ ఇప్పుడు ఏమి చెబుతాడని సుధాకర్ ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాలు మధ్య ఉన్న నదీ జలాల వివాదం పైన  ఆస్తుల పంపకాల పైన బి ఆర్ యస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. తెలంగాణ లో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు చేసుకుంటున్న వారే  బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆనాడు సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని  తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చితే ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం తో తెలంగాణ అస్తిత్వం నవ్వులపాలవుతుందన్నారు.

ఏ మొహం పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆంధ్ర నాయకులను ఎందుకు బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్న.  ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కొని బీఆర్ఎస్ పార్టీ ఆరాచక పాలనకు చరమ గీతం పాడి తెలంగాణ సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ అబాసుపాలు కాకుండా పాలకుల కళ్ళు తెరిపించాలని కోరుతున్నానని బండి సుధాకర్ గౌడ్ అన్నారు.

Related posts

రూ. 410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్

Satyam NEWS

మావోయిస్టు పార్టీ పై మరో ఏడాది నిషేధం

Satyam NEWS

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

Bhavani

Leave a Comment