37.2 C
Hyderabad
May 2, 2024 14: 51 PM
Slider సంపాదకీయం

మడమ తిప్పని నాయకత్వమా.. ఓ సారి తిరిగి చూడు

#CM Jagan

151 సీట్లు…. తిరుగులేని అధికారం…. మడం తిప్పని నాయకత్వం… రాజకీయంగా ఎవరూ తిరుగుబాటు చేసే అవకాశం కూడా లేని పటిష్టమైన పార్టీ యంత్రాంగం…. అయితే ఎందుకు ఈ అశాంతి? తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించామని చెప్పుకున్న వైసీపీ, అదే ఎన్నికల్లో తిరుగుబాటు చేశారని చాలా మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మనుషులు కూడా తిరుగుబాటు చేశారు. ఎందుకో తెలియదు. అదే విధంగా ఎమ్మెల్యేలలో కూడా ఏదో తెలియని అసంతృప్తి తొంగి చూస్తున్నది. ఆ అసంతృప్తి పార్టీ అధిష్టానం పై కాకుండా అధికారులపైకి డైవర్ట్ అవుతున్నది.

అప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డి… ఇప్పుడు…

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అప్పటిలో కలకలం రేపాయి. ఇప్పుడు అదే రేంజ్‌లో మరో ఎమ్మెల్యే తెరపైకి వచ్చారు. ఆయనే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

ఆయన ఆ జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడుపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ప్రసన్నకుమార్రెడ్డి అప్పటిలో అన్నట్లుగానే… ‘‘ఇవాళ ఉండి రేపు పోయే కలెక్టర్’’ అని విరుచుకుపడ్డారు. “జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలం గాడిదలు కాయడానికి ఉన్నామా?” అంటూ ఎమ్మెల్యే కంట్రోల్ తప్పిపోయారు.

అంతే గాక కలెక్టర్‌పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. కలెక్టర్ చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని… హనీ ట్రాప్ గురించి పత్రికల్లో రాకపోయి ఉంటే ఈ పాటికి బదిలీ అయి ఉండేవారని మండిపడ్డారు. హనీ ట్రాప్ గురించిన ప్రస్తావన రావడంతో అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రవర్తనపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జిల్లా కలెక్టర్ …. హనీ ట్రాప్… ఏమాకథ?

కొత్తగా హనీ ట్రాప్ గురించి వెంకట్రామిరెడ్డి మాట్లాడటంతో అసలేం జరిగిందన్న చర్చ కూడా అనంతపురం రాజకీయాల్లో జరుగుతోంది. కొద్ది రోజుల కిందట… ఆంధ్రజ్యోతి దినపత్రిక పేర్లు చెప్పకుండా ఇద్దరు కలెక్టర్ల ఘనకార్యాల గురించి రాసింది. ఇందులో ఓ కలెక్టర్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో వ్యవహరించే తీరు గురించి ఉంది. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని కూడా చెప్పింది.

బహుశా.. ఆ హనీ ట్రాప్… గంధం చంద్రుడు గురించేనని.. వెంకట్రామిరెడ్డి మాటలతో తెలిసిపోతోందని…అనంతపురం జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కడం లేదు.

పెరుగుతున్న రాజకీయ అగాధం

జిల్లాలో మంత్రులుగా ఉన్న వారే మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేల మాట కూడా చెల్లుబాటు కావడం లేదు. అదే సమయంలో.. నిధులు లేకపోవడంతో.. ఎమ్మెల్యేలు అడిగిన పనులు కూడా చేయలేకపోతున్నారు. ఈ కారణంగా .. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతోంది.

అది కలెక్టర్లపై దూషణల వరకూ వెళ్తోంది. ఇలాంటి ఎమ్మెల్యేలను ప్రభుత్వం మందలించను కూడా మందలించకపోతూండటంతో… అలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రులకు పడటం లేదు. చాలా మందిలో అసహనం పెరిగిపోతున్నది.

ఆ అసహనం అధికారులు చేసే తప్పులను బయటపెట్టే స్థాయికి వచ్చేసింది. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులపై గళం ఎత్తడం పరోక్షంగా రాజకీయ అశాంతి అని చెప్పవచ్చు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవాలను ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు.

సాధారణమైన… చిన్ని తగాదానే…

అయితే కడప జిల్లా పులివెందుల మండలం అంకేపల్లి, చిల్లవారిపల్లె గ్రామాల మధ్య ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. ఊరేగింపు విషయం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించండం మంచిది కాదని, ఉత్సవ విగ్రహాలు ఊరిగించవద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ గ్రామంలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మొదలు పెట్టారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్వామి ఊరేగింపు చేయరాదంటూ అడ్డుకున్నారు. గ్రామంలోని ఆలయానికి తలుపులు వేయాలంటూ ఆదేశాలు ఇవ్వటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరేగింపు సమయానికి అక్కడికి చేరుకున్న డీసీఎంఎస్‌ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మండల నాయకులు అశ్వత్థ, భాస్కర్‌రెడ్డి.. గ్రామస్థులకు నచ్చజెప్పి, పంపారు.

గుడి తలుపులు మూయటంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి సోదరుడు రామేశ్వరరెడ్డి, ధర్మకర్త సోదరుడు బాలిరెడ్డి పురుగుల మందు తాగారు. తమ గ్రామంలో ప్రశాంతంగా ఊరేగింపు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగిన వారిని మొదట నార్పలకు, అక్కడి నుంచి అనంతపురం వైద్యశాలకు తరలించారు. ఇది ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. ఇలా ఎమ్మెల్యేలకు కోపం రావడం, దాన్ని బహిరంగంగా ప్రదర్శించడం రాజకీయ పెద్దల వైఫల్యం. పరిపాలనానుభవం లేని వారి నిర్వాకం.

Related posts

వర్మ రాజ్యంలో వచ్చిన మరో చెత్త సినిమా

Satyam NEWS

చప్పట్లు కొట్టలేను

Satyam NEWS

హిందీ ఓకే… ఇంగ్లీష్ వద్దంటే ఎలా?

Satyam NEWS

Leave a Comment