30.3 C
Hyderabad
March 15, 2025 11: 00 AM
Slider తెలంగాణ

మద్యం షాపులు తెరిచి రాష్ట్రాన్ని ఆగం చేశారు

#Revanth Reddy

కరోనా లాక్ డౌన్ నిబంధనలు సడలించి మద్యం షాపులు తెరవడంతో రాష్ట్రం ఆగమైపోయిందని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మద్యం దుకాణాలు తెరవడంతో 45 రోజులుగా క్రమశిక్షణతో పాటించిన లాక్ డౌన్ ఒక్క రోజుతో ఆగమాగం అయిందని ఆయన అన్నారు.

వైన్‌ షాపుల దగ్గర వందల మంది గుంపులుగా ఉన్నప్పుడు రాని కరోనా.. ఒక్కరిద్దరు పొట్టకూటి కోసం పని చేసుకునే మెకానిక్ షాప్స్‌ల ద్వారా వస్తుందా అని ప్రశ్నించారు. వైన్‌ షాపులకో న్యాయం.. చిన్న షాపులకో న్యాయమా అన్నారు. లాక్ డౌన్‌లో వేలకోట్ల బిజినెస్‌ను పోగొట్టుకొని వ్యాపారులు ప్రభుత్వానికి సహకరిస్తే .. వైన్స్‌ షాపులు తెరవడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు.

Related posts

తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం

Satyam NEWS

విద్యుత్ షాక్ తో ఇళ్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

Satyam NEWS

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడికి సన్మానం

Satyam NEWS

Leave a Comment