29.7 C
Hyderabad
May 3, 2024 04: 31 AM
Slider ముఖ్యంశాలు

అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు భేటీ

#indrakaranreddy

వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య భవన్ లో జరిగింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వైస్ చైర్మన్, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ హోదాలో అధ్యక్షత వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు చేపట్టిన 30 అభివృద్ది కార్యక్రమాలు, వాటికి అవసరమైన అటవీ అనుమతులపై ఐదవ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశంలో చర్చారు. అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ, విద్యుత్ ఆధునీకరణ, టీ ఫైబర్ గ్రిడ్ పనుల అనుమతులపై చర్చించారు.

వైల్డ్ లైఫ్ బోర్డులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమాధానాలు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగే విధంగా ప్రతిపాదనలు రూపొందించామని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర స్థాయి అనుమతుల తర్వాత కేంద్ర అనుమతులు అవసరం అయితే, ఆ ప్రతిపాదనలు కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపుతామని పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్,  ఎం.సీ పర్గెయిన్, డీసీఎఫ్ శ్రీనివాసరావు,  స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

భూమిలో నత్రజని స్థిరీకరణకు జీలుగ విత్తనాలు వేయండి

Satyam NEWS

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు రంగం సిద్ధం

Satyam NEWS

రాజీనామా చేసిన పెద్దమందడి వైస్ ఎంపీపీ రఘు ప్రసాద్

Satyam NEWS

Leave a Comment