38.2 C
Hyderabad
April 29, 2024 12: 34 PM
Slider మహబూబ్ నగర్

రాజీనామా చేసిన పెద్దమందడి వైస్ ఎంపీపీ రఘు ప్రసాద్

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల వైస్ ఎంపీపీ రఘు ప్రసాద్ బుధవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను తమ మండల ఎంపిపి మెగారెడ్డితో కలిసి ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని పెద్దమందడి ఎంపిపి మెగారెడ్డి నివాసంలో ఆయనను కలిసి అక్కడే తన రాజీనామా పత్రం పై సంతకాలు చేశారు. స్వచ్ఛందంగా ప్రజల కోసం కష్టపడే మెగారెడ్డి లాంటి వ్యక్తుల వెంట ఉండడం బాగుంటుందని భావించి రాజీనామా చేశానని అన్నారు. ఇన్నాళ్లు తనకు పదవి అలంకారప్రాయంగానే ఉందని, ఎక్కడ తనను తానుగా గుర్తించిన దాఖలాలు లేవని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీలో కేవలం చెప్పుకునేందుకే పనికి వచ్చే పదవులు తప్ప ప్రజాసేవకు ఉపయోగపడవని ఆయన పేర్కొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఈ కత్తుల స్వైరవిహారం ఫొటోలు ఎక్కడివో తెలుసా?

Satyam NEWS

ములుగులో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు

Satyam NEWS

ప‌ల్స్ పోలియోను విజ‌య‌వంతం చేయండి

Satyam NEWS

Leave a Comment