Slider నెల్లూరు

దేశంలోని గిరిజనులందరికీ మొబైల్ నెట్వర్క్ కవరేజీ అందుతుందా?

దేశంలోని గిరిజనులు అందరికీ మొబైల్ నెట్వర్క్ కవరేజీ అందుతుందా? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం లోక్సభలో ప్రశ్నించారు. ఒకవేళ అందకుంటే తీసుకున్న చర్యలు ఏమిటని కూడా ప్రశ్నించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖామంత్రి దేవ్ సిన్ చౌహన్ రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ 2022 మార్చి నాటికి 1,20,613 గిరిజన గ్రామాలు ఉండగా, అందులో 1,00,030 గ్రామాలకు మాత్రమే మొబైల్ నెట్వర్క్ కవరేజ్ ఉందని తెలిపారు. ఇంకా 20, 583 గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇవన్నీ వాణిజ్యపరంగా లాభదాయకం కాని, తక్కువ జనాభా ఉన్న కఠినమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దశలవారీగా కనెక్టివిటీని అందిస్తారని తెలిపారు. ఇందుకుగాను ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Related posts

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం

Bhavani

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గ్రామ వాలంటీర్

Satyam NEWS

Leave a Comment