29.7 C
Hyderabad
April 29, 2024 10: 05 AM
Slider జాతీయం

షారుఖ్, దీపికా పాటపై తీవ్ర అభ్యంతరాలు

#sharukkham

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో దీపికా పదుకొనె, షారుఖ్ ఖాన్ డ్యాన్స్ స్టెప్పులు ట్రోల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాస్ట్యూమ్స్ మార్చకపోతే సినిమా విడుదలకు అనుమతించాలా వద్దా అని ఆలోచిస్తానని చెప్పారు.

ఈ పాటలో దీపికా పదుకొణె చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాటలో దీపిక బికినీలో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్రంగా విమర్శించింది. ఈ పాట జైన్ మారిబా పాట ట్యూన్‌ను దొంగిలించి చేసిందని కూడా అంటున్నారు. భ్రష్టు పట్టిన మనస్తత్వం కారణంగానే ఈ పాట చిత్రీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు.

దీపిక దుస్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ముస్లిం పఠాన్ అని, అతను ఆకుపచ్చ చొక్కా ధరించి, కాషాయ దుస్తులు ధరించిన హిందూ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తున్నదని ఇది అభ్యంతరకరమని మరి కొందరు అంటున్నారు. ఇది ‘లవ్ జిహాద్’ కిందికి వస్తుందని కూడా మరి కొందరు అంటున్నారు.

Related posts

ఎన్ యు జె ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ఎన్ ఎన్ ఆర్

Satyam NEWS

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బాసట

Satyam NEWS

నేపాల్లో జరిగిన కరాటే అండర్ 14 విభాగంలో సత్తా చాటిన సలోమి

Satyam NEWS

Leave a Comment