36.2 C
Hyderabad
April 27, 2024 22: 36 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రంలోని అక్ర‌మ ఆటోల‌పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి….!

#vijayanagarampolice

ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపికా జిల్లా  కేంద్ర‌మైన విజయ‌న‌గ‌రం లోని ట్రాఫిక్ పై దృష్టి పెట్టారు. మొన్నీ మ‌ధ్య‌నే స్వ‌యంగా  న‌గరంలోని ప‌ద్మావ‌తి న‌గర్ లో ఉన్న‌ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ను ఆకస్మికంగా సంద‌ర్శించి..సిబ్బంది చేస్తున్న విధుల‌ను ట్రాఫిక్ క్ర‌మ‌బద్దీక‌ర‌ణ‌పై ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారో ట్రాఫిక్ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. కాగా రెండురోజుల క్రిత‌మే డీపీఓలోనే ట్రాఫిక్ స‌మ‌స్య వాహ‌నాల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు,స్టేక్ హోల్డ‌ర్స్ తో మీటింగ్ కూడా జ‌రిగింది. త‌ద‌నుగుణంగానేతాజాగా  ట్రాఫిక్ ఎస్ఐలుముందుగా న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు హెల్మ్ ట్, సీబుక్, సీటు బెల్ట్ త‌దిత‌ర అంశాల‌పై అవగాహ‌న క‌ల్పించేందుకు డీఎస్పీ మోహ‌న్ రావు సూచ‌న‌ల‌తో ఎస్ఐలు భాస్క‌ర‌రావు, హ‌రిబాబు,దామోద‌ర‌రావు, ఏఎస్ఐలు నూక‌రాజు,త‌దిత‌ర ముఖ్య‌మైన సిబ్బంది అంతాస్వ‌యంగా హెల్మెట్ లు పెట్టుకుని మ‌రీ ఎత్తురోడ్డు  నుంచీ కోట జంక్ష‌న్ వ‌ర‌కు అవ‌గాహ‌న ర్యాలీ చేప‌ట్టారు.అనంర‌తం  ఎస్ ఐ భాస్క‌ర్ రావు ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద సీబుక్  లేని  ఆటోల‌ను, వేగంగా వెళుతున్న ఆటోల‌ను గుర్తించడంతో దాంతో పాటుప‌రిమితికి మించి ప్ర‌యాణీకుల‌ను ఎక్కించుకోవ‌డం అలాగే మితిమీరిన వేగంతో ఆటోల‌ను న‌డుపుతున్న వాటికిగుర్తించి ఆయా ఆటో డ్రైవ‌ర్ల సీబుక్ ల‌ను సీజ్ చేయించారు. అలాగ సంబంధిత ఆటో డ్రైవ‌ర్ల‌కు క్లాస్ ఇచ్చారు కూడ‌. ఏదైనా జిల్లా కేంద్రంలోని  ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఓ అడుగు ప‌డింద‌నే అని  అంటోంది…స‌త్యం న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొఱ్ఱెలు పంపిణీ చేయాలి

Satyam NEWS

చిన్నజీయర్‌ స్వామి దిష్టి బొమ్మలను తగలబెట్టాలి

Sub Editor 2

దేవరకొండ ‘కామ్రేడ్‌’కు మరమ్మతులు

Satyam NEWS

Leave a Comment