39.2 C
Hyderabad
April 30, 2024 19: 20 PM
Slider జాతీయం

ఇండియాకు అనువైనది ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ మాత్రమే

#OxfordVaccine

ఆక్సఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇన్ స్టిట్యూట్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ భారతీయులకు అత్యంత అనువైనదని నిపుణులు చెబుతున్నారు.

ఆక్సఫర్డ్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ వ్యాక్సిన్ భారతీయులు పూర్తిగా విశ్వసించేదిగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు కూడా మంచి ఫలితాలు వచ్చాయి.

ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ కు మరో సానుకూల అంశం ఏమిటంటే ఈ వ్యాక్సిన్ ను అతి శీత ప్రదేశంలో నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు.

ఫైజర్ కంపెనీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ ను కేవలం 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచవచ్చు.

ఇన్ని సుగుణాలు ఉన్న ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ అతి త్వరలో వచ్చేస్తున్నది.

Related posts

రెడ్ ఎలర్ట్: కామారెడ్డిలో కరోనా పంజా

Satyam NEWS

కారు-బైక్ ఢీకొని ఐదుగురు మృతి

Satyam NEWS

మహిళలు విద్యా, ఆరోగ్యం, కేరీర్‌పై దృష్టి పెట్టాలి

Satyam NEWS

Leave a Comment