38.2 C
Hyderabad
May 5, 2024 22: 57 PM
Slider వరంగల్

మహిళలు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి: తస్లీమా

#taslima

ప్రతి మహిళ ప్రశ్నిచేతత్వం అలవర్చుకోవడం వలన సామాజిక రుగ్మతులను రూపుమాపవచ్చని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం  (నుగూరు) వెంకటాపురం మండల కేంద్రంలో దిశ వెల్ఫేర్ పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళ సాధికారిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తస్లీమా జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో పని చేసుకుంటూ అన్ని రంగాలలో నైపుణ్యతతో సాధికారిత సాధించాలని  తస్లీమా అన్నారు. ప్రేమించే గుణం కలిగిన ఆడపడుచులు చెడుపై కాళీకమాతాల్లా తిరుగబడి హక్కులను కాపాడుకోవాలని తెలిపారు.

మహిళలు చట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలని, బాల్య వివాహాలు,వరకట్న సమస్యలపై నిర్మూలన కోసం చట్టాలపై అవగాహన అవసరమని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైడ్ ప్రొఫెసర్ తిప్పని సిద్ధులు,పడిశ్రీ శ్రీనివాస రావు, కొర్శ నర్సింహ మూర్తి, చిడం రవి, ముతమ్మ,సతీష్,రమణమ్మ,సత్యవతి,హుస్సేన్,మోహన్ రావు,దిశ వెల్ఫేర్ పౌండేషన్ సభ్యులు,మహిళలు తదితరులు ఉన్నారు.

Related posts

పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి సముచిత స్థానం: నందమూరి సుహాసిని

Satyam NEWS

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

Satyam NEWS

కరోనాతో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ వి ప్రసాద్ దంపతుల మృతి

Satyam NEWS

Leave a Comment