40.2 C
Hyderabad
April 28, 2024 16: 04 PM
Slider నెల్లూరు

వి యస్ యూ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

#vikramsimhapuri

అధ్యాపకులు తమ జ్ఞానం, అనుభవాన్ని రంగరించి బోధించాలని అప్పుడే విద్యార్థుల్ని విజ్ఞానవంతుల్ని చేయగలమని విక్రమ సింహపురి వ్యవస్థాపక వైస్ ఛాన్స్ లర్ ఆచార్య సి ఆర్ విశ్వేశ్వరరావు చెప్పారు. పాండవులు కృష్ణుడి తో కలిసి  రాజధర్మాల గురించి తెలియజేయమని కోరేందుకు భీష్ముని వద్దకు వెళ్లిన  సందర్భంలో కృష్ణుడితో చెప్పలేని విషయాలు చెబుతాను అని భీష్ముడు అనగానే అనుభవం చాలా గొప్పది అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటే అధ్యాపకులు బాధ్యత ఎంతటిదో అవగతమవుతుంది అన్నారు.

ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. బోధన అంటే ప్రజల రాష్ట్రపతి గా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం ఎంత ఇష్టపడే వారిని ఆయన అధ్యాపకులు విద్యార్థులు చర్చించుకోవాలి అని చెప్పేవారు అన్నారు.

విద్యాబోధన అంటే మెదడును నింపడం కాదని జ్ఞాన జ్యోతిని వెలిగించడం అని అన్నారు నాణ్యమైన విద్యను అందించాలని జీవితకాలం నేర్చుకుంటూ ఉండాలని సూచించారు నూతన విద్యా విధానంలో సూచించినట్లుగా మల్టీ డేసిప్లిన్ వైపు వేగంగా అడుగులు పడాలని అన్నారు. అధ్యాపకులు నిబద్ధతతో పనిచేస్తూ భారతదేశ విలువలను కాపాడేందుకు కృషి చేయాలని ఉద్బోధించారు.

పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఇంచార్జ్ వైస్ ఛాన్స్ లర్ బి రాజశేఖర్ మాట్లాడుతూ అధ్యాపకులు మూసధోరణిని విడలాడాలని కోరారు. కరోనా నేపథ్యంలో విద్యారంగం అగాధంలోకి కూరుకుపోయిందని అయినా పెద్దగా నష్టం జరగకుండా ఆన్లైన్ ఇతరాత్రా ప్రత్యామ్నాయాలతో కొంతమేరకు గాడిలో పెట్టినట్లు చెప్పారు. మనం సమిష్టిగా పని చేస్తూ విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి కంకణబద్ధులం కావాలని అన్నారు.

బోధనలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలని నిజానికి పుస్తకాలు కంప్యూటర్లు కూడా అధ్యాపకులు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయని  చెప్పారు గిరిగీసుకుని ఉండిపోకుండా సమాజంలో వస్తున్న మార్పులను గమనించాలని సూచించారు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు

ఈ సమావేశంలో ఆచార్య చంద్రయ్య రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ కృష్ణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య  సుజ ఎస్ నాయర్ ,దూరదర్శన్ మాజీ డైరెక్టర్ పద్మనాభయ్య, ఆచార్య అందే ప్రసాద్,ఆచార్య. జవాహర్ బాబు,డావిజయలక్ష్మి, డా వై.విజయ. డా.సిహెచ్.విజయ,డా.ఉదయ్ శంకర్ అల్లం,సుబ్బరామరాజు,హుస్సేనయ్యా,వీరారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్సిడెంట్:గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం5గురి మృతి

Satyam NEWS

తిరుపతిలో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతం

Satyam NEWS

Over-The-Counter Lower Blood Pressure Medication Quick Way To Lower Blood Pressure At Home

Bhavani

Leave a Comment