38.2 C
Hyderabad
May 3, 2024 20: 31 PM
Slider కడప

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

#MinisterAmzadBasha

మహిళల పక్షపాతిగా ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు  పేర్కొన్నారు.

కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని యోగివేమారెడ్డి సత్రం లో సోమవారం వైయస్సార్ ఆసరా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  మాట్లాడుతూ  ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల సుఖసంతోషాలు కోరే ప్రభుత్వమన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలు సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని అనునిత్యం తపన పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి గతంలో తమ సుదీర్ఘ పాదయాత్ర నందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చుకుటూ ముందుకు వెళ్తున్నారన్నారు.

ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా ఆదుకుంటున్నాం

దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ప్రవేశపెట్టి డ్వాక్రా సంఘాల బలోపేతానికి కృషి చేశారన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు.

జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లల చదువుల కోసం ఏడాదికి 15 వేల రూపాయలు తల్లుల ఖాతాలకు  జమ చేసినట్లు చెప్పారు. జగనన్న విద్యా దీవెన ద్వారా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, వంటి కోర్సులు చదివేందుకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తిస్థాయిలో ప్రభుత్వమే వారికి ఫీజు మొత్తం చెల్లిస్తుదన్నారు.

వైయస్సార్ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ ఏడాదికి 18,750 రూపాయలు వారి ఖాతా కు జమ చేస్తామని అన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారని నేడు ఎవ్వరికి ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మీ ముంగిటకే ప్రభుత్వ పథకాలు చేరుస్తున్నామని చెప్పారు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఇంటి పట్టాలు పంపిణీ చేసిన తర్వాత రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని చెప్పారు.

మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం మహిళ పేరుతో ప్రవేశపెట్టి మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు  చేస్తూ ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారన్నారు. 

ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలకే ప్రజలకు ఇచ్చిన హామీల లో 94% హామీలు నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రికే  దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారిమఠం మండలంలోని 475 డ్వాక్రా సంఘాలకు 3 కోట్ల 2 లక్షల 76 వేల రూపాయల మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు  అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంగమానిరెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు వీర నారాయణ రెడ్డి, గోవింద్ రెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ 18న విడుదల

Bhavani

ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో  క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS

Leave a Comment