క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల ఇమ్మానుయేల్ (మ్యాని), పార్టీ సీనియర్ నేతలు, దళిత,క్రిస్టియన్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.