38.2 C
Hyderabad
April 29, 2024 21: 38 PM
Slider హైదరాబాద్

మహిళలు విద్యా, ఆరోగ్యం, కేరీర్‌పై దృష్టి పెట్టాలి

padmarao goud

అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలు బీసీ సంఘాల మహిళా నేతలు పద్మా రావు నివాసానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా పద్మా రావు మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా విద్యా, ఆరోగ్యం, కేరీర్‌పై దృష్టిపెట్టి లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మార్పు తీసుకువచ్చే విధంగా మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. మహిళ విద్యావంతురాలయితేనే కుటుంబంతో పాటు సమాజం బాగుంటుందని అన్నారు. మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అవసరమని  అన్నారు. ఈ సందర్బంగా పద్మా రావు మనుమరాలు  కేక్ కట్ చేశారు. పద్మా రావు తో పాటు ఆయన సతీ మణిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో నిర్మలా ముధిరాజ్, సునీత, మంజులత, భాగ్య, సుమితా, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫేక్ ఫైర్ :సింగపూర్లోలోవిమాన రాకపోకలకు అంతరాయం

Satyam NEWS

ఫారెస్ట్ ప్లస్ 2.0 ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన నారా లోకేష్

Satyam NEWS

Leave a Comment