31.2 C
Hyderabad
May 3, 2024 02: 48 AM
Slider రంగారెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే బేతి

#uppalmla

అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో భాగంగా  కే టీ ఆర్. పిలుపు మేరకు హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే బేతి  సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అతిధులుగా పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన  “మహిళా బంధు కేసీఆర్ ఉత్సవాలు” సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలను వివరించారు. ఈ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో  మానవహారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, తెరాస నాయకురాళ్లకు సన్మానం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి మేనమామగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతని ఇస్తున్నారని , ఇప్పటిదాకా 10 లక్షల మంది పైచిలుకు లబ్దిదారులకు మొత్తం రూ.9,022 కోట్ల ఆర్థిక సహాయం అందించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి , తండా వాసుదేవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

22న మున్సిపల్ శాఖామంత్రి బొత్స జిల్లా పర్యటన…!

Satyam NEWS

చలో ఖమ్మం జయప్రదం చేయండి: టి ఎన్ టి యు సి

Satyam NEWS

విమానాల మరమత్తు కేంద్రం ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ

Bhavani

Leave a Comment