38.2 C
Hyderabad
April 29, 2024 21: 27 PM
Slider రంగారెడ్డి

జియోటెక్నికల్, స్ట్రక్చరల్  ఇంజనీరింగ్‌లో పురోగతిపై కార్యశాల

#structuralengeneering

జియోటెక్నికల్ మరియు స్ట్రక్చరల్  ఇంజనీరింగ్‌లో పురోగతిపై నేడు సీబీఐటి కళాశాల లో  సివిల్ విభాగం ఆధ్వర్యంలో  ఒక రోజు కార్యశాల నిర్వహించారు. ఐఐటి కాన్పూర్ విశ్రాంతి ప్రొఫెసర్ ఎమ్ ఆర్ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరై  జియోటెక్నికల్ మరియు స్ట్రక్చరల్  ఇంజనీరింగ్‌లో పురోగతిపై వస్తున్న మార్పులు, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్, రీహాబిలిటేషన్, రీట్రోఫిట్టింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, భూకంప-నిరోధక నిర్మాణాలలో తాజా పరిశోధన ఫలితాలు వివరించారు. ఈ కార్యక్రమానికి  గౌరవ అతిథిగా వచ్చిన యెన్ఐటి వరంగల్  ప్రొఫెసర్  పి రతీష్ కుమార్  మాట్లాడుతూ అంతర్జాతీయ స్ట్రక్చరల్  ఇంజనీరింగ్ లో జరుగుతున్న మార్పులు వివరించారు.

సివిల్ విభాగ అధిపతి ప్రొఫెసర్ కె. జగన్నాధరావు పరిశోధన మరియు కన్సల్టెన్సీలో విభాగం కార్యకలాపాలను వివరించారు. కళాశాల లో  సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ లో  గత 33  సంవత్సరాలు గా పనిచేస్తున్న  ప్రొఫెసర్ ఎమ్‌వి కృష్ణారావు, జి భాస్కర్ రెడ్డి కి  ఈ సందర్భం గా సన్మానo చేశారు. ఈ  ఇద్దరూ మంచి ఉపాధ్యాయులని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి కొనియాడారు.  ఈ కార్యక్రమ నిర్వాహకులు గా  సివిల్ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. నేమాని రవి దక్షిణ మూర్తి వ్యవహరించారు.

Related posts

అవినీతిపరుల ‘సత్య ప్రమాణం’ రాజకీయాలు

Satyam NEWS

క‌రోనా నిబంధనల నేపథ్యంలో పైడితల్లి ఉత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజి పనులు

Satyam NEWS

Leave a Comment